తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి టీఆర్ ఎస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో...ఏపీలో కూడా సీఎం బాబు ‘ముందస్తు’కు వెళతారా అనే చర్చ జరిగిన సంగతి తెలిసిందే. దీన్ని నిజం చేస్తూ తాజాగా ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 19వ తేదీ బుధవారం పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు 15 వేల మంది ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇందులో మంత్రుల నుండి మొదలుకొని సాధారణ కార్యకర్తల వరకు ఉన్నట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలపై బాబు పలు సూచనలు చేశారు. సంక్రాంతికి ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. తాజాగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలంటూ ఏపీ ముఖ్యమంత్రి - పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబుపై గులాబీ దళం తీవ్రంగా విరుచుకపడింది. ఏకంగా ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతామంటూ ఆ పార్టీ నేత (ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్) కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు స్పందిస్తూ చేసిన పనులతో గెలుపు ఏకపక్షం కావాలని - అసెంబ్లీలో అధిక్యత ఎంపీ సీటు గెలుపునే డిసైడ్ చేస్తుందని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తుక్కుతుక్కుగా ఓడిపోయిందని గుర్తు చేసిన బాబు ప్రజా వ్యతిరేకత ఎలా ఉందో ఈ ఎన్నికలు నిరూపించాయని వివరించారు. డిసెంబర్ చివరి వారంలో శ్వేతపత్రాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెప్పడం జరిగిందని...దీనిని సాకుగా చూపి కేసీఆర్ రెచ్చగొట్టారని విమర్శించారు. టీఆర్ ఎస్ తొలుత హోదాకు అంగీకరించి ఇప్పుడు మాత్రం అడ్డుపడుతోందని..తెలంగాణలో టీఆర్ ఎస్ గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ కు ఇప్పుడు ఓవైసీ దోస్త్ అయ్యారన్న బాబు...మోడీ కనుసన్నలలో జగన్..ఒవైసీ పనిచేస్తున్నారని విమర్శించారు.
పార్టీ అభ్యర్థుల్ని కూడా ముందుగానే ప్రకటించి ఎన్నికలకు వెళ్తామని చంద్రబాబు అన్నారు. ప్రతి కార్యకర్త ఇంటిపైనా టీడీపీ జెండా ఎగరాలని - పార్టీలో గ్రూపులు కట్టకుండా పనిచేస్తే అందరికీ సముచిత స్థానం దక్కుతుందని భరోసా ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ఏపీలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరగలేదని చంద్రబాబు అన్నారు. 5 రాష్ట్రాల్లో ఎక్కడా బీజేపీ గెలవలేక పోయిందని - 3 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే గెలిచాయని - దేశం మొత్తం మోడీ పాలనను తిరస్కరిస్తోందన్నారు. ఏపీ మినహా అన్ని రాష్ట్రాల రైతుల్లో అశాంతి నెలకొందని - మైనారిటీల్లో అభద్రత పెరిగిందన్నారు. దేశంలో మూడో కూటమికి ఉనికే లేదన్నారు. అలా చేసే అది బీజేపీకి దొడ్డిదారిన మేలు చేస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సోనియాగాంధీ మేడ్చల్ సభలో చెప్పిన విషయాన్ని నేతల వద్ద ప్రస్తావించారు చంద్రబాబు. ఇదే సాకుగా చూపించి కేసీఆర్ సెంటిమెంట్ రగిల్చి తెలంగాణలో గెలిచారన్నారు. అక్కడ KCR గెలిస్తే.. ఇక్కడ వైసీపీ సంబరాలు చేసుకోవడం ఏంటో అర్థం కావడం లేదన్నారు.