చంద్రబాబు నాయుడు తానేదో రాష్ట్రం కోసం దేశంలోని అన్ని పార్టీల మద్దతును సాధించేసి.. అదే దెబ్బలో.. ప్రత్యేకహోదాను సాధించేసుకువస్తా అనే రీతిలో వీరబీభత్స ప్రతిజ్ఞలు చేసి ఢిల్లీ యాత్రను ముగించుకు వచ్చారు. ఇంతకూ ఆయన ఢిల్లీ యాత్రలో ఏం చేశారు. రాష్ట్రంకోసం ఉపయోగపడే పనులకు ఎంత సమయం కేటాయించారు.. ఇతర రాజకీయ అంశాలకు ఎంత సమయం కేటాయించారు. మధ్యలో తన సొంత డబ్బా కొట్టుకోవానికి.. ప్రచారానికి ఎంత సమయం కేటాయించారు.. అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
మీడియాను సమర్థంగా వాడుకుని.. నాయకుడిగా అత్యున్నత స్థానాలకు ఎగబాకడంలో గతంలో చంద్రబాబును మించిన వారు లేరని.. అందరూ చెప్పుకుంటుండేవారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే నరేంద్రమోడీ.. మీడియాను వాడుకుని కీర్తి పెంచుకోవడంలో చంద్రబాబును మించిపోయారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబునాయుడు తన పాత స్టయిల్లో జూలు విదిల్చి.. మీడియా మెట్ల మీద ప్రచార శిఖరాలకు ఎక్కుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇప్పుడు ఢిల్లీయాత్రలో ఆయన ఏ పనులకు ఎంత సమయం కేటాయించారో గమనిస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది.మంగళవారం ఢిల్లీ వెళ్లగానే ఆయన పార్లమెంటు సెంట్రల్ హాల్ కు వెళ్లారు. అక్కడ వివిధ పార్టీల నేతలతో భేటీ అయ్యారు. సంభాషించారు. తర్వాత ఏపీభవన్ కు చేరుకున్నారు. అక్కడ పలు విడతలుగా సొంత పార్టీలకు చెందిన ఎంపీలతో మాట్లాడారు. బుధవారం ఉదయం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏపీ భవన్ కు వచ్చి చంద్రబాబును కలిశారు. వీరిద్దరి మంతనాలు సాగాయి. మళ్లీ సాయంత్రం.. ఆయన మీడియామీట్ లో మాట్లాడి మోడీ సర్కారు మీద నిప్పులు చెరిగారు.
ఇంతకు తప్ప అధికారికంగా ఇంకే కార్యక్రమాలు గానీ - పార్టీల నేతల వద్దకు వెళ్లి భేటీ కావడం గానీ జరగలేదు. ఈ మూడు పనులూ కేవలం కొన్ని గంటల వ్యవహారమే కదా.. మిగిలిన సమయం అంతా బాబు ఏం చేస్తున్నారు..? అంటే.. ఆయన జాతీయ స్థాయి మీడియా ఛానెల్స్ కు విడివిడిగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ గడిపారు. ఒక్కోఛానెల్ ఇంటర్వ్యూకు కనీసం గంటకు పైగా సమయం పడుతుందని అనుకుంటే.. చంద్రబాబు ఢిల్లీలో గడిపిన రెండు రోజుల కంటె తక్కువ వ్యవధిలో దాదాపుగా 20 గంటలపాటు ఆయన మీడియాకు ఇంటర్వూలు ఇవ్వడంలోనే గడిపారన్నమాట.
ఇప్పుడు ఆలోచిస్తే.. జాతీయ స్థాయిలో తనకు ప్రచారం కల్పించుకోవడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లినట్లుగా ఉన్నదే తప్ప.. పార్టీలను కలిసి మద్దతు కూడగట్టడానికి వెళ్లినట్లు లేదని పలువురు అంటున్నారు. అందుకే ఆయన సాయంత్రం ప్రెస్ మీట్ లో చాలా మంది మాకు మద్దతిస్తున్నారు అనగలిగారే తప్ప.. నిర్దిష్టంగా నాలుగు పార్టీ లపేర్లు కూడా చెప్పలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.