మంగ‌ళ‌గిరి చంటి గాళ్ల పంట పండింది

Update: 2019-03-27 08:46 GMT
మంగ‌ళ గిరి చ‌రిత్ర గ‌మ‌నిస్తే... లోకేష్‌ ని అక్క‌డ నిలబెట్ట‌డం చంద్ర‌బాబు సాహ‌సం చేసిన‌ట్టు లెక్క‌. అదొక భారీ ప్ర‌యోగం. ఎందుకంటే అయితే అక్క‌డ కాంగ్రెస్ గెలుస్తుంది,  లేదంటే క‌మ్యూనిస్టులు గెలుస్తారు... చివ‌ర‌కు గ‌త ఎల‌క్ష‌న్ల‌లో కూడా జ‌గ‌న్ అభ్య‌ర్థి గెలిచాడే గానీ టీడీపీ గెల‌వ‌లేదు. ఎందుకంటే టీడీపీకి ఆ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా వ్య‌తిరేకం. 1952 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే తెలుగుదేశం ఆవిర్భావం త‌ర్వాత‌ 8 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. కానీ తొలి రోజుల్లో ఎన్టీఆర్ గాలి విపరీతంగా ఉండ‌టం వ‌ల్ల 1983 - 85 ఎన్నిక‌ల‌లో మాత్ర‌మే టీడీపీ గెలిచింది. మ‌ళ్లీ పాత పాటే మంగ‌ళ‌గిరిది. మ‌రి టీడీపీ ఇంత బ‌ల‌హీనంగా ఉన్న చోట లోకేష్ ని నిల‌బెట్టి చంద్ర‌బాబు త‌ప్పు చేశాడా అని అనుకుంటున్నారేమో... చంద్ర‌ బాబు వ్యూహాలు ఇలాగే ఉంటాయి. భ్ర‌మ‌లు క‌లిగించ‌డానికి ఆయ‌న చేసే ప్ర‌యోగాల్లో ఇది ఒక‌టిగా మారింది.

దీనికి రెండు కార‌ణాలు... తెలుగుదేశం వారికి సంబంధించిన వ్య‌క్తులు - బినామీల ఆస్తులున్న చోటు మంగ‌ళ‌గిరి అని ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అంతెందుకు చంద్ర బాబు నివాసం కూడా అక్క‌డే ఉంది. దీంతో మంగ‌ళ‌గిరిలో టీడీపీ ఎమ్మెల్యే ఉండ‌టం వారికి అన్ని విధాల శ్రేయ‌స్క‌రం - అవ‌స‌రం. పార్టీ అధికారంలో లేకున్నా స్థానిక ఎమ్మెల్యేకంటూ కొన్ని హ‌క్కులుంటాయి. ప్రొటోకాల్ ఉంటుంది. ఆ విధంగా టీడీపీ ఎమ్మెల్యే ఉంటే రేపొద్దున్న ఓడినా కొంత‌వ‌ర‌కు ప‌నికొస్తుంది అన్న‌ది ఒక వ్యూహం. మ‌రి అలాంట‌పుడు ఎవ‌రినైనా పెట్టొచ్చు క‌దా లోకేష్ ఎందుకు అనుకోవ‌చ్చు. పెట్టిన వ్య‌క్తి ఇత‌ర పార్టీలోకి జంప్‌ అయ్యే ప్ర‌మాదం ఉంద‌న్న‌ది చంద్ర‌బాబు ముందు చూపు. అందుకే లోకేష్‌ని పెట్టాలి. గెలిపించుకోవాలి.

ఇక రెండో కార‌ణం... పార్టీ ఒక‌వేళ అధికారంలోకి వ‌స్తే... అమ‌రావ‌తి నిర్మాణాల్లో భాగంగా ఈ ప్రాంతంలో వ‌చ్చే కొన్ని వంద‌ల ర‌కాల భారీ కాంట్రాక్టులు ఉండ‌బోతున్నాయి. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే అంటే... రాజ‌ధాని ఎమ్మెల్యే. అలాంట‌పుడు ఇత‌ర పార్టీ వాళ్లు ఉంటే టీడీపీ అధికారంలో ఉన్నా కూడా ఇబ్బందే. అందుకే లోకేష్ ఉంటే... ఇక ఆ యాపారమే వేరు అంటున్నారు.

స‌రే లాభాలు, ప్ర‌యోజ‌నాలు బాగున్నాయి... గెలుస్తాడా? అన్న‌ది ఒక పెద్ద అనుమానం. ఈ విష‌యంలో కొంత రిస్కు నిజ‌మే గాని... లోకేష్‌ ను గెలిపించ‌డానికి పార్టీ భారీ ప్లాన్లు వేసిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మ‌నీ మేనేజ్‌ మెంట్ విష‌యంలో ఏమాత్రం వెన‌క్కుత‌గ్గ‌డం లేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏ నియోజ‌క‌వ‌ర్గంలో అయినా *చంటి గాళ్లు* ఉంటారు. అంటే లోక‌ల్ లీడ‌ర్లు. వారు ఎవ‌రి చేతుల్లో ఉంటే వారికి గెలుపు అవ‌కాశాలు ఎక్కువ‌. అందుకే మంగ‌ళ‌గిరి ప‌రిధిలో ఉన్న ప్ర‌తి చోటా మోటా లీడ‌రుకు పిలుపు అందింది. ఎవ‌రి స్థాయిని బ‌ట్టి వారికి ప్ర‌త్యేక హామీలు - త‌క్ష‌ణ న‌గ‌దు బ‌హుమ‌తులు భారీ ఎత్తున ముట్ట‌జెప్పార‌ట‌. వేరే పార్టీ క‌నీసం ఊహించ‌లేని ఫిగ‌ర్ ఇక్క‌డ ఖ‌ర్చు పెడుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సోమవారం   రాత్రి ఒక్క‌రోజే 15 కోట్లు ఈ చంటిగాళ్ల‌కు పంచిన‌ట్లు స్థానికంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వాహ‌నాలు - డ‌బ్బు - అధికారంలోకి వ‌స్తే చిన్న చిన్న కాంట్రాక్టులు వంటివ‌న్నీ ప్రామిస్ చేసేశారు.

తాజాగా చ‌క్క‌ర్లు కొడుతున్న వార్త ఏంటంటే... మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గంలో లోకేష్ గెల‌వాలి. ఎంత ఖ‌ర్చ‌యినా ప‌ర్లేదు అని ఖ‌రాఖండిగా ఆదేశాలు వెళ్లాయట‌. రాష్ట్రంలో యావరేజ్ గా ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కులు 20 కోట్లు చెప్పున ఖ‌ర్చు పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, మంగ‌ళ‌గిరిలో అది తారాస్థాయికి చేరింద‌ట‌. 80-100 కోట్లు ఖ‌ర్చ‌యినా ప‌ర్లేదు గాని లోకేష్ గెల‌వాల‌ని పార్టీ డిసైడ్ అయిన‌ట్లు మంగ‌ళ‌గిరిలో వార్త‌లు గుప్పుమంటున్నాయి. దీంతో లోక‌ల్ లీడ‌ర్ల పంట పండింది.
Tags:    

Similar News