ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా జరిపిన అమెరికా పర్యటన గురించి తెలిసిందే. తన అమెరికా పర్యటనలో చివర్లో ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మయో క్లినిక్ ను చూశారు. అమెరికాలోనే అతి పెద్ద ప్రైవేటు ఆసుపత్రిగా పేరు ప్రఖ్యాతులున్న మయో క్లినిక్ ను సందర్శించిన ఆయన.. ఆ ఆసుపత్రి పని తీరుకు ఇంప్రెస్ అయ్యారని చెబుతున్నారు. ఒకప్పుడు తనకు కుడిభుజంగా ఉండి.. తన రాజకీయ ప్రయాణంలో కీలకభూమిక పోషించిన దేవేందర్ గౌడ్ ప్రస్తుతం మయో ఆసుపత్రిలో క్యాన్సర్ కు చికిత్స పొందుతున్నారు.
దాదాపు 128 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పురాతన ఆసుపత్రి ఎంత పెద్దదంటే.. ఈ ఛైన్ ఆసుపత్రుల్లో 4500 మంది ఫిజీషియన్లు.. 57 వేల మంది సిబ్బంది పని చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రిని ఏపీకి తీసుకురావాలన్న భావనను చంద్రబాబు వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
ఈ ఆసుపత్రికి ఉన్న మరో ప్రత్యేక ఏమిటంటే.. వైద్య రంగానికి సంబంధించి విస్తృతమైన పరిశోధనల్ని నిర్వహిస్తోంది. రీసెర్చ్ కోసమే ప్రతి ఏటా ఈ ఛైన్ ఆసుపత్రుల సంస్థ ఏకంగా 600 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. దేవేందర్ గౌడ్ ను పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా.. ఈ ఆసుపత్రి గురించి తెలుసుకున్న ఆయన.. వారి పని తీరుకు ఇంప్రెస్ అయ్యారని.. ఆ ఆసుపత్రి ప్రతినిధులతో భేటీ అయిన ఆయన.. మయో సేవల్ని ఏపీలో అందించాల్సిందిగా కోరినట్లుగా చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి ఆఫర్ కు మయో ఆసుపత్రుల సంస్థ అధికారికంగా స్పందించలేదు. బాబు మాటలతో మయో కానీ ఏపీకి వస్తే..భారత వైద్యరంగంలో సంచలనంగా మారటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/