ఢిల్లీలో ఒక చంద్రుడు.. మ‌రో చంద్రుడు కేర‌ళ‌లో!

Update: 2019-05-07 06:24 GMT
రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఇద్ద‌రు చంద్రుళ్లు వేర్వేరు చోట్ల చేస్తున్న రాజ‌కీయ లాబీయింగ్ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. నిజానికి ఇద్ద‌రు చంద్రుళ్లు ఒకే స‌మ‌యంలో జ‌రుపుతున్న చ‌ర్య‌లు మోడీకి ప్ర‌త్యామ్నాయంగా కావ‌టం విశేషం. ఐదు ద‌శ‌లు పూర్తి అయ్యే వ‌ర‌కూ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి గ‌ళం విప్ప‌ని కేసీఆర్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా య‌మా స్పీడ్ గా పావులు క‌దుపుతున్న‌ట్లుగా వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తున్నారు. త‌న‌కు న‌చ్చిన‌ప్పుడు.. న‌చ్చిన రీతిలో వ్య‌వ‌హ‌రించే కేసీఆర్.. తాజాగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మీద అంద‌రి దృష్టి ప‌డేలా.. అంద‌రూ దాని గురించి మాట్లాడుకోవాల‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

జాతీయ వామ‌ప‌క్ష నేత‌ల‌తో సానుకూల సంబంధాలు లేని కేసీఆర్‌.. అందుకు భిన్నంగా కేర‌ళ ముఖ్య‌మంత్రి విజ‌య‌న్ చేత ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంశాన్ని చ‌ర్చించి.. పార్టీలో చ‌ర్చ జ‌ర‌పాల‌న్న బాధ్య‌త‌ను ఆయన మీద పెట్టారు. అదే స‌మ‌యంలో కేర‌ళ ముఖ్య‌మంత్రితో ఫోన్ లో ట‌చ్ లో ఉన్న కేసీఆర్‌.. ఈ నెల 13న స్టాలిన్ తో భేటీ కావాల‌ని నిర్ణ‌యించారు.దేశంలో మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వామ‌పక్షాలు ముందుడుగు వేయాల‌ని.. దేశ అభ్యున్న‌తి కోసం స‌మాఖ్య కూట‌మి ప్ర‌తిపాద‌న‌ను అధ్యయం చేసిన నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని కేసీఆర్ కోరుతున్నారు. ఇదే వామ‌ప‌క్షాల మీద దారుణ‌మైన వ్యాఖ్య‌ల్ని కేసీఆర్ గ‌తంలో చేయ‌టాన్ని మ‌ర్చిపోలేం.

ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నారు. తాజాగా ఆయ‌న నేష‌న‌ల్ కార్ఫ‌రెన్స్ అధ్యక్షుడు ఫ‌రూక్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. ప్ర‌స్తుతం తాను అదే ప‌నిగా ప్ర‌స్తావిస్తున్న వీవీ ప్యాట్ అంశాన్ని ఆయ‌న మ‌రోసారి చ‌ర్చ‌కు తీసుకొచ్చారు.

ఈ రోజు వీవీ ప్యాట్ల‌లో 50 శాతం ఓట్ల‌ను లెక్కించాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై సుప్రీంలో చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో మ‌రోసారి ఈ అంశాన్ని ఆయ‌న చ‌ర్చ‌కు తీసుకొచ్చారు. వీవీ ప్యాట్ల‌లోని ఓట్ల‌ను 50 శాతం లెక్కించాల‌న్న అంశంపై జాతీయ స్థాయిలో పార్టీల‌ను కూడ‌గ‌ట్టే ప‌నిని చంద్ర‌బాబు తీసుకోవ‌టం తెలిసిందే. రెండు వేర్వేరు దిశ‌ల్లో ఇద్ద‌రు చంద్రుళ్లు.. జాతీయ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేసేలా ప‌ర్య‌ట‌న‌లు చేయ‌టం ఆస‌క్తిక‌ర అంశంగా చెప్పాలి. ఒక‌రు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో.. మ‌రొక‌రు వీవీ ఫ్యాట్ల పేరుతో చేస్తున్న టూర్లు రానున్న రోజుల్లో ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తాయో చూడాలి.


Tags:    

Similar News