తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కష్టాల్లో ఉంది. గెలిచిన ఎమ్మెల్యేల్లో శాసనసభాపక్ష నేత సహా చాలామంది పార్టీని వీడారు. మిగిలిన కొద్దిమందిలోనూ ఇద్దరుముగ్గురు కూడా నేడో రేపో టీఆరెస్ లో చేరుతారన్నట్లుగా ఉంది పరిస్థితి. తెలుగుదేశాన్ని జాతీయ పార్టీగా విస్తరించాలని కలలు కంటున్న చంద్రబాబుకు తెలుగు రాష్ట్రంలోనే కష్టాలు ఎదురవుతున్నాయి. అయితే... ఇంత జరుగుతున్నా చంద్రబాబు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నారు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉంటున్నారు. తెలంగాణలో పార్టీ కోసం సమయం కేటాయించలేనని... ఏపీపై మాత్రమే దృష్టి పెడతానని స్పష్టం చేసేశారు. దీంతో చంద్రబాబుపై ఇంకా నమ్మకం, ఆశలు ఉన్న కొద్ది మంది టీటీడీపీ నేతలు కూడా ఇక లాభం లేదనుకుంటున్నారట. చంద్రబాబుతో రీసెంటుగా భేటీ అయిన టీటీడీపీ నేతలు చంద్రబాబు హ్యాండ్సప్ పొజిషన్ చూసి ఇక ఆయన చేసేదేమీ ఉండదని... మనదారి మనం చూసుకోవడం బెటరన్న నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.
తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబును కలిసి సుమారు 5 గంటల పాటు చర్చించిన సంగతి తెలిసిందే. కష్టాల్లో ఉన్న పార్టీకి దారి చూపిస్తారని... ధైర్యం చెబుతారని ఆశపడి వచ్చిన టీటీడీపీ నేతలు మరింత నిరాశలో కూరుకుపోయారు. చంద్రబాబు మాటలు విన్న తరువాత ఇక ఈయన చేసేదేమీ లేదని డిసైడయ్యారట. ''నాకు ఆంధ్రప్రదేశ్ లో చాలా సవాళ్లు ఉన్నాయి.. వాటిని అధిగమించి ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలి.. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో పార్టీ కోసం ఫుల్ టైమ్ కేటాయించలేను'' అని చంద్రబాబు తేల్చిచెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని, అసమ్మతి వర్గం కారణంగానే ఓటమి చెందామని రేవంత్ రెడ్డి - రమణ వివరించినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పూర్వ వైభవం రావాలంటే మీరు తప్పని సరిగా రెండురోజులు కేటాయించాలని రేవంత్ కోరగా చంద్రబాబు నిరాకరించినట్లు సమా చారం. ఒకరోజయినా కేటాయించాలని రమణ కోరారు. అందుకు కూడా చంద్రబాబు అంగీకరించలేదట. దీంతో ఎల్.రమణ వంటి చంద్రబాబు వీరాభిమాని కూడా ఆలోచనలో పడ్డారని టాక్.