తాజాగా మరోసారి విశాఖపట్నంలో భారీ ఎత్తున భాగస్వామ్య సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచదేశాల నుంచి బడా కంపెనీలు చంద్రబాబు పనితీరును చూసి ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్దమయ్యాయి. భాగస్వామ్య సదస్సు వేదికగా ఎం.ఓ.యు. లు కుదుర్చుకున్నాయి. ఈ విషయంలో అనుకున్నదానికంటే ఎక్కువగా సుమారు 10.5 లక్షల కోట్లమేర పెట్టుబడులు సాధించింది ఏపీ ప్రభుత్వం. అనుకున్నదానికంటే అధికమొత్తంలో పెట్టుబడులు సాధించామని ప్రభుత్వ పెద్దలు సంబరాలు కూడా చేసుకున్నారు! ఆ సంగతులు అలా ఉంటే ఆ ఎంఓయూ లపై సందేహాలు కలిగేలా బాబు స్పందించారు!
హోదా వస్తేనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని అంతా చెబుతున్న తరుణంలో, హోదా లేకుండా కూడా తాను ఏపీకి పరిశ్రమలు రప్పించగలనని చెప్పుకునే ప్రయత్నమో ఏమో కానీ... గత రెండు సంవత్సరాలుగా భాగస్వామ్య సదస్సు పేరు చెప్పి తెగ ఎంఓయూలు చేయించేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2016లో జరిగిన ఎంఓయూలలో ఎన్ని కార్యరూపం దాల్చాయి.. దానివల్ల ఏపీలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి.. అనే విషయాలపై ఇప్పటివరకూ ఏమాత్రం స్పష్టత లేని తరుణంలో... 2017లో మరోసారి ఈ ఎంఓయూల కార్యక్రమం నిర్వహించారు. తాజాగా "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" లో ఆంధ్రా నంబర్ వన్ గా నిలుస్తోందని చెప్పిన చంద్రబాబు.. విశాఖ జరిగిన భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఎమ్.ఒ.యు.లలో 90 శాతం అమలు అయ్యేలా కృషి చేస్తున్నామని అన్నారు!
ఇక్కడే ఉంది అసలు మెలిక... ప్రభుత్వం ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్న రూ.10.5 లక్షల కోట్లలో అప్పుడే చంద్రబాబు పదిశాతం తగ్గించేశారు. ఈలెక్కన గతఏడాదిలో జరిగిన ఎంఓయూల మాదిరిగానే 2018లో మరోసారి ఈ భాగస్వామ్య సదస్సు పెడితే... అప్పుడు 2016 - 2017ల ఎంఓయూల సంగతి మరిచి 2018 లో సుమారు 15లక్షల కోట్ల కొత్త ఎంఓయూలు సృష్టించినా ఆశ్చర్యపోనక్కరలేదన్నమాట! ఎందుకంటే... కొత్త సదస్సు పెట్టేనాటికి పాత సదస్సుల్లో ఎంఓయూలు కనుమరుగయిపోతున్నాయి కదా!! పరిశ్రమలు పెడతాం అని ముందుకొచ్చినవారిలో ఎంఓయూలకే పరిమితమని బాబు చెబుతున్న ఆ 10% కంపెనీల సంగతి అలా ఉంచితే, గత ఏడాది జరిగిన 100% ఎంఓయూల సంగతేమిటి? ప్రభుత్వ పెద్దలు చెబుతున్న పరిశ్రమల్లో కొన్ని కాగితాలకే పరిమితమని బాబు చెప్పకనే చెబుతున్నారని ఈ సందర్భంగా భావించొచ్చు. ఒకసారి ఈస్థాయిలో ఎంఓయూలు చేసుకున్న తరువాత మరలా కనీసం ఎన్నో కొన్ని అమలయ్యేలా కృషి చేయడం ఏమిటి? ప్రభుత్వ పెద్దలకే తెలియాలి!!
ఆ సంగతులు అలా ఉంటే... బాబు ఇక్కడ ఒకబలమైన లాజిక్ కావాలని మరిచిపోతున్నారో, తెలియనట్లు నటిస్తున్నారో తెలియదు కానీ... ప్రత్యేక హోదా వస్తే ఈ భాగస్వామ్య సదస్సుల్లో బలవంతపు ఎంఓయూల గోల ఉండనే ఉండదు! ఇప్పటివరకూ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏయే దేశాలు తిరిగారని, ఏమేమి సదస్సులు నిర్వహించారని ప్రపంచ దేశాలతోపాటు ఏపీ నుంచి కూడా రాజకీయ నాయకులు, బిజినెస్ మేన్ లు వెళ్లి పరిశ్రమలు పెట్టారు. వారిలో టీడీపీకి చెందిన ఎంపీలు - రాజ్యసభసభ్యులు కూడా ఉన్నారు కదా! వారిని అక్కడికి ఎవరు ఆహ్వానించారు.. ఏ మీటింగ్ పెట్టి ఎంఓయూలు చేయించారు.. అనంతరం అవి అమలయ్యేలా ఎవరు కృషి చేశారు.. అలాంటిదేమీ లేదు కదా!! హోదా ఉంటే పరిశ్రమలే రాష్ట్రం ముందు క్యూ కడతాయి.. పారిశ్రామిక వేత్తలే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కోసం అర్జీలు పెడతారు.. అధికారికంగా వచ్చే వాటిపై దృష్టి పెట్టడం మానేసి, ఇలా బ్రతిమాలుకునో, బలవంతంగానో కంపెనీలు పెట్టేస్తున్నామని ప్రకటించుకోవాల్సిన పరిస్థితి ఎందుకో అర్ధం కాని పరిస్థితి! పోని అలా అయినా అవి కాగితాలను దాటి కార్యరూపం దాల్చాయా అంటే... సమాధానం కోసం శూన్యంలోకి చూడాల్సిన పరిస్థితి!
ఇలా కృషి చేస్తాం.. అవుతాయి.. వస్తున్నాయి.. వస్తాయి.. వంటి మాటలు ప్రత్యేక హోదా వస్తే ఉండవు! హోదా వస్తే పరిశ్రమలు రెక్కలు కట్టుకుని వచ్చి వాలతాయి! ఈ విషయంలో చంద్రబాబుకి ఏమైనా సందేహాలుంటే... ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టిన ఏపీ టీడీపీ నేతలను అడిగి తెలుసుకుంటే సరి.. అని పలువురు సూచిస్తున్నారు!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/