మోడీకి మీ అసంతృప్తి వ్యక్తంచేయండి

Update: 2015-10-24 07:28 GMT
ప్రధాని మోడీ - ఏపీ సీఎం చంద్రబాబులు ఇద్దరూ టెక్నాలజీలో డాన్ లే. పాలనలోనే కాదు పబ్లిక్ పల్స్ పట్టుకోవడం, వారి ఒపీనియన్ తెలుసుకోవడంపైనా ఈ ఇద్దరూ నిత్యం కన్నేసి ఉంచుతారు. ఈ విషయంలో ఇద్దరికి ఇద్దరూ ఉద్ధండులే అయినా మోడీ మాత్రం చంద్రబాబును మించిపోతున్నట్లుగా ఉన్నారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో ప్రజలు ఎలా ఫీలవుతున్నారన్నది చంద్రబాబు తెలుసుకుంటుంటే, వారు తమ నుంచి కోరుకున్నది దక్కనందుకు ఏమైనా అసంతృప్తిగా ఉన్నారా అన్నది మోడీ రాబడుతున్నారు. ఈ పల్స్ దొరికితే నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలన్నది వీరు అంచనా వేసుకోనున్నారు. రాజధాని కార్యక్రమ భోజనాలపై ప్రజాభిప్రాయాన్ని అదే రోజు తెలుసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు. దీనికోసం చిన్నపాటి సర్వే కూడా చేయించారు. చివరకు 70 శాతం మంది భోజనాలపై సంతృప్తిగా ఉన్నారని.. 30 శాతం మంది అసంతృప్తిగా ఉన్నారని తేల్చారు. ఇలా, చంద్రబాబు తాను చేసిన ఏర్పాట్లపై ఫీడ్ బ్యాక్ తీసుకోగా మోడీ ఇంకొంచెం ముందుకెళ్లారు. తాను ఏపీకి వరాలేమీ కురిపించకపోవడంపై ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయన తెలుసుకుంటున్నారు. తన ప్రసంగంపై ఐవీఆర్‌ ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు మోడీ. 833399999 ఫోన్‌ నుంచి ఇప్పటికే చాలామంది ఫోన్లు వచ్చాయి.. ఆ కాల్ తో కేంద్రం వారి నుంచి అభిప్రాయలు సేకరిస్తోంది.

రాస్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటంచలేదని విపక్షాలు ఆందోళనలు చేస్తున్న నేపద్యంలో ప్రధాని ప్రసంగం పై రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరపడం విశేషం. కాబట్టి ప్రజలు ఏమాత్రం మొహమాటం లేకుండా తమ అసంతృప్తిని వెల్లడిస్తే తప్ప మోడీకి ఏపీ ప్రజల అవసరాలు తెలియవు. మొహమాటానికి పోయి మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తే మాత్రం ముందుముందు మోడీ ఏపీకి పైసా కూడా విదిల్చరు. ఇప్పటికే ఇతర మార్గాల ద్వారా మోడీ ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని ప్రజల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించి నష్టనివారణగా పట్టణీకరణ పథకాల్లో భాగంగా కొంత నిధులు ప్రకటించారు. ఇప్పుడు ప్రజలు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కూడా ఆయనకు చేరితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News