జపాన్‌లో ల్యాండ్‌ అయిన బాబు

Update: 2015-07-05 09:39 GMT
తన విదేశీ పర్యటనలతో ఏపీ రాష్ట్రానికి ఎంత లాభం అన్న విషయాన్ని ఇప్పటివరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పింది లేదు. ఒకవేళ ఇలాంటివి ఆయనకు కుదరకపోయినా..కనీసం ఆయన అధికారులు అయినా అలాంటి ప్రయత్నం చేయాల్సి ఉంది. కానీ.. అలాంటివేమీ చేయని పరిస్థితి. ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించిన చంద్రబాబు తాజాగా మరో విదేశీ పర్యటనను షురూ చేయటం తెలిసిందే.

శనివారం రాత్రి హైదరాబాద్‌లో బయలుదేరిన ఆయన.. ఆదివారం ఉదయం హాంకాంగ్‌కు చేరుకున్నారు.  అక్కడి నుంచి జపాన్‌కు బయలుదేరిన ఆయన.. కొద్దిసేపటి క్రితమే చేరుకోనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ పారిశ్రామిక వేత్తలు సిద్ధంగా ఉన్నారని గతంలో చెప్పిన చంద్రబాబు.. తాజాగా మరోసారి జపాన్‌ పర్యటన చేపట్టటం గమనార్హం.

తాజా విదేశీ పర్యటనలో.. గతంలో మాదిరే చంద్రబాబు వెంట మంత్రులు నారాయణ.. యనమల రామకృష్ణుడు.. పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఎన్ని వందల కోట్ల పెట్టుబడులు వస్తాయో కానీ.. కోట్ల రూపాయిల ఖర్చులు మాత్రం చేసేస్తున్నారు. ఖర్చుతో పాటు.. ఎంతోకొంత ఫలితం దక్కితే బాగుండు.

Tags:    

Similar News