కాపులను బ్రతిమలాడుకుంటున్న చంద్రబాబు

Update: 2019-02-24 08:14 GMT
వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. మళ్లీ ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలని చంద్రబాబు - ఈసారైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జగన్ - ఎక్కువ సీట్లు గెలిచి రాజకీయాల్లో కీలకంగా మారాలని పవన్‌కల్యాణ్‌.. ఇలా ఎవరి వ్యూహాల్లో వాళ్లు ఉన్నారు. అయితే.. పవన్‌ కల్యాణ్‌ పుణ్యమా అని గత ఎన్నికల్లో కాపులంతా టీడీపీకి ఓట్లు వేశారు. దీంతో.. ఉత్తారాంధ్ర - ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీకి అత్యధిక సీట్లు వచ్చాయి. దీంతో.. ఈసారి కూడా కాపుల ఓట్లు టీడీపీకే పడాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా కాపుల్ని దాదాపుగా బ్రతమిలాడుకున్నంత పని చేస్తున్నారు.

గతంలో కాపులకు విద్యారుణాలు ఇచ్చారు. 100 కోట్ల ఫండ్‌ ఏర్పాటు చేశారు. అలాగే 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ జీవో జారీ చేశారు. అంతేకాదు రాబోయే రోజుల్లో  మరిన్ని పథకాలు అమలు చేస్తానని చెప్తూ కాపులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. వీటితో పాటు.. కాపు నాయకుల్ని కూడా అడపాదడపా కలుస్తూ.. వారిని మంచి చేసుకుంటున్నారు. రీసెంట్‌ గా కాపునాడు  రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావుని పిలిపించుకుని మాట్లాడారు. కాపులకు టీడీపీ ప్రభుత్వం ఎంత చేస్తుంది వివరించారు. పిళ్లా కూడా చంద్రాబాబు అద్భుతం - బాగా చేస్తున్నారని పొగిడారు. ఉత్తరాంధ్ర - గోదావరి జిల్లాలో కాపుల ఓట్లు చాలా కీలకం. కాపుల ఓట్లన్నీ గంపగుత్తగా పడితే.. దాదాపు 40 సీట్లకు పైగా వస్తాయి. అందుకే.. కాపుల ప్రాబల్యం ఎక్కువుగా ఉన్న  ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలని అనుకుంటున్న చంద్రబాబు.. కాపుల ఓట్లు వైసీపీ - జనసేనకు పోకుండా జాగ్రత్త పడుతున్నారు.
Tags:    

Similar News