రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు వాస్తు పిచ్చి పీక్ కి చేరుతోంది. ఇప్పటి వరకు తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే ఈ విషయంలో దూకుడుగా ఉన్నారని అందరూ అనుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బంగారంలాంటి(అన్ని విపక్షాలూ చెబుతున్న ప్రకారం) ఉమ్మడి సచివాలయాన్ని కూలగొట్టి వేరే చోట రూ.850 కోట్లతో కొత్తది వాస్తు రీత్యా కట్టేందుకు కేసీఆర్ సన్నాహాలు చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టును పెండింగ్ లో పెట్టారు. అయితే, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం.. రాష్ట్రంలో ఆర్థిక కష్టాల్లో ఉందని, తీవ్ర ఆర్థిక లోటును ఎదుర్కొంటోందని, జీతాలు ఇవ్వడానికే తాము నానా తిప్పలు పడుతున్నామని ప్రతి రోజూ చెబుతూనే తన వాస్తు పిచ్చిని పీక్ స్టేజ్ లో అమలు చేసేందుకు మాత్రం ఎన్ని లక్షలు ఖర్చయినా వెనుకాడడం లేదు.
అందరూ వద్దని మొత్తుకున్నా - పదేళ్లపాటు హైదరాబాద్ లోని అసెంబ్లీని వినియోగించుకునే వెసులుబాటు ఉన్నా..అమరావతి ప్రాంతంలో తాత్కాలిక అసెంబ్లీని నిర్మించి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టిన బాబు.. అధునాతన సాంకేతిక వ్యవస్థను సైతం ఏర్పాటు చేశారు. అయితే, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆయన అనుకున్నట్టు వాస్తు సరిగా రాలేదట. దీంతో ఆయన ఇప్పుడు మళ్లీ అసెంబ్లీని మరికొన్ని లక్షలు వెచ్చించి సరిచేయిస్తున్నారు. విషయంలోకి వెళ్తే.. ప్రభుత్వం అసెంబ్లీ భవనానికి మార్పులు - చేర్పులు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాస్తు దోషం అంటూ సచివాలయంలో పలు మార్పులు చేర్పులు చేసిన సర్కార్.. అసెంబ్లీ భవనానికి మార్పులు చేయనుంది.
వాస్తు కోసం అధికారులు ...కొత్త గేటు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో ఐదు గేట్లు ఏర్పాటు చేయగా, తాజాగా ఆరో గేటు నిర్మిస్తున్నారు. వాస్తు దోషం కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రూటు మార్చుకుని వెళుతున్న విషయం విదితమే. అంతేకాకుండా సచివాలయంలో పలు గోడలు - నిర్మాణాలు పగులగొట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో అడుగుపెట్టిన దగ్గర్నుంచీ టీడీపీ సర్కారుకు పలు ఆటంకాలు ఎదురవుతున్నట్లు ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
శాసనసభ ప్రారంభం తొలి రోజే ఇలా జరగడంతో టీడీపీ శ్రేణులు అపశకునం ఎదురైనట్లు చర్చించుకున్నారు. దీంతో అసెంబ్లీకి వాస్తు దోషాలు ఉన్నట్లు గుర్తించి మార్పులు చేస్తున్నారు. సచివాలయం వైపు ఆరో గేటు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇంకా ఏం మార్పులు చేస్తుందో చూడాలి. మొత్తానికి ప్రజాధనాన్ని ఇలా వాస్తు కోసం ఖర్చు చేస్తుండడం అన్ని వర్గాల్లోనూ విస్మయం కలిగిస్తోంది. ఇక, రాజధాని విషయంలోనూ కృష్ణానది తూర్పుదిక్కుగా ప్రవహించే చోట నిర్మిస్తే.. అధికారానికి తిరుగుండదని పండితులు చెప్పడంతో నిపుణులు సహా రాజధానిపై ఏర్పాటైన కేంద్ర కమిటీ వద్దన్నా నది ఒడ్డునే నిర్మాణం చేపడుతున్నారు బాబు. మరి ఇలా ఆయన తన ఇష్టం వచ్చినట్టు నిర్మించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని అంటున్నారు హేతువాదులు. దీనిపై తెలుగు దేశం నాయకులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ స్పందిస్తారో? లేదో చూడాలి!!