ఆయ‌న్ను క‌లిశాడంటే..బాబు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ నిజ‌మే

Update: 2018-08-22 17:53 GMT
న‌వ్యాంద్ర‌ప్ర‌దేశ్‌ లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఖ‌రారైందా? కొద్దికాలంగా ఊరిస్తున్న ఈ ప్ర‌క్రియ‌కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాన్ని ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు పూర్తిచేశారా? త‌్వ‌ర‌లో ఈ ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ తో  సీఎం చంద్రబాబు విజ‌య‌వాడ‌లో భేటీ  అవ‌డంతో ఈ చ‌ర్చ మొద‌లైంది. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా విజయవాడ చేరుకున్న గ‌వ‌ర్న‌ర్‌ ను చంద్ర‌బాబు క‌లుసుకోవ‌డం - సుదీర్ఘంగా చ‌ర్చించ‌డం ఇందుకు తెర‌తీస్తోంది.

త్వ‌ర‌లోనే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని ఇటీవ‌ల‌ చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తొలి విడతిగా హాజ్ యాత్రకు వెళుతున్న ముస్లింలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ముస్లింల‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.  ముస్లింల సంక్షేమం కోసం పాటుప‌డ‌తామ‌ని హామీ ఇచ్చారు. ఈ స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఇప్పుడే ఎందుకు చంద్ర‌బాబు ఈ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ప్ర‌స్తావ‌న తెస్తున్నార‌నేది అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించింది. ఇందుకు ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు వినిపించాయి. బీజేపీతో నాలుగేళ్లుగా అంట‌కాగిన చంద్ర‌బాబు ఇటీవ‌ల ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. కేంద్రప్రభుత్వం నుండి ఎన్డీఏ నుండి తెలుగుదేశంపార్టీ తప్పుకోవటంతో రాష్ట్ర మంత్రివర్గానికి బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేశారు. దాంతో దాదాపు రెండు నెలలుగా వారి స్ధానాలు భర్తీ కాకుండా అలానే ఉండిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఈ రెండు సీట్ల‌ను భ‌ర్తీ చేసేందుకు బాబు స‌న్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం. మ‌రోవైపు బీజేపీకి గుడ్‌బై చెప్పిన‌ప్ప‌టికీ బాబుకు బీజేపీకి మ‌ధ్య దోస్తీ ఉంద‌నేందుకు అనేక తార్కాణాలు ఉన్నాయి. సాక్షాత్తు పార్ల‌మెంటు సాక్షిగా బాబు త‌మ ఆప్తుడ‌ని కేంద్ర‌మంత్రులు చెప్ప‌డం, మ‌రోవైపు పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు బీజేపీ ముఖ్యుల‌తో బాబుతో ట‌చ్‌లో ఉంటున్న నేప‌థ్యంలో బీజేపీ ప‌ట్ల బాబు వ్య‌తిరేక‌త‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేదంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధానంగా ముస్లింల‌కు చేరువ అయ్యేందుకు చంద్ర‌బాబు మైనార్టీల‌కు మంత్రి ప‌ద‌వి అనే అజెండాను తెర‌మీద‌కు తెచ్చిన‌ట్లు టాక్ న‌డుస్తోంది. ఈ ప్ర‌క్రియ‌కు సంబంధించే గ‌వ‌ర్న‌ర్‌ తో చ‌ర్చించార‌ని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని పెండింగ్ ప్రాజెక్టులు - పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల‌పై గవర్నర్ నరసింహాన్‌ తో చంద్రబాబు చర్చించిన‌ట్లు టీడీపీ పేర్కొంటున్న‌ప్ప‌టికీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ప్ర‌ధాన అంశ‌మ‌ని అంటున్నారు. ఏపీ మంత్రి వర్గంలో మైనార్టీలకు అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని,.  త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, ఈ భేటీ అందుకు తార్కాణ‌మ‌ని అంటున్నారు.
Tags:    

Similar News