ఏకాంత స‌మావేశంలో బాబుకు గ‌వ‌ర్న‌ర్ సూచ‌న‌?

Update: 2018-04-23 04:59 GMT
షెడ్యూల్ లేదు. హైద‌రాబాద్ కు వెళ్లాల్సిన గ‌వ‌ర్న‌ర్ ప్ర‌యాణం విశాఖ నుంచి విజ‌య‌వాడ‌కు చేరుకుంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు రాజ్ భ‌వ‌న్ కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్  ద‌ర్శ‌నం చేసుకొని.. ఏకాంతంగా మాట్లాడుకునే తీరుకు భిన్నంగా గ‌వ‌ర్న‌రే నేరుగా ముఖ్య‌మంత్రితో స‌మావేశం కావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇంత‌కీ బాబుతో గ‌వ‌ర్న‌ర్ ఆక‌స్మిక భేటీ ఎందుకు జ‌రిగింది?  దాదాపు 100 నిమిషాల పాటు సాగిన ఈ మీటింగ్ వివ‌రాల్ని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచే కాదు రాజ్ భ‌వ‌న్ నుంచి ఎలాంటి ప్రెస్ నోట్ లేదెందుకు?  ఇంత‌కీ.. ఇంత సుదీర్ఘంగా.. ఏకాంతంగా గ‌వ‌ర్న‌ర్.. ముఖ్య‌మంత్రి బాబు ఏం మాట్లాడుకున్నారు? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వెతికితే ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగులోకి వ‌స్తాయి.

ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంతో పాటు.. విభ‌జ‌న చట్టంలోని హామీల్ని నెర‌వేర్చ‌లేదంటూ మోడీ స‌ర్కారుపై పోరాటం చేస్తున్న చంద్ర‌బాబుకు గ‌వ‌ర్న‌ర్ పేరుతో సందేశం అందింద‌ని చెబుతున్నారు. ఏపీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో త‌న‌కు తానే ఫీలై.. స‌ల‌హా చెబితే మంచిద‌న్న ఉద్దేశంతో విజ‌యవాడ‌కు వ‌చ్చిన‌ట్లుగా గ‌వ‌ర్న‌ర్ చెబుతున్నా.. దీని వెనుక ఆస‌క్తిక‌ర అంశాలు ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.

గ‌వ‌ర్న‌ర్.. బాబుల భేటీకి సంబంధించిన స‌మాచారం మొత్తం బాబుకు మైలేజీ పెరిగేలా.. గ‌వ‌ర్న‌ర్ డ్యామేజ్ అయ్యేలా ఉండ‌టం గ‌మ‌నార్హం. హోదా సాధ‌న విష‌యంలో ఏపీ స‌ర్కారు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. ఈ స్పీడ్ ను తగ్గించాలంటూ గ‌వ‌ర్న‌ర్ చెప్పిన‌ట్లుగా విశ్వ‌స‌నీయ స‌మాచారం బ‌య‌ట‌కు రావ‌టం విశేషం. గ‌వ‌ర్న‌ర్.. బాబు ఇద్ద‌రు మాత్ర‌మే పాల్గొన్న మీటింగ్ కు సంబంధించిన స‌మాచారం ఎవ‌రు చెప్ప‌గ‌లుగుతారు?  మీటింగ్ లో ఏం మాట్లాడుకున్ని అయితే గ‌వ‌ర్న‌ర్ నోటి నుంచి కానీ లేదంటే బాబు నోటి నుంచి మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌చ్చే వీలుంది.

ప్ర‌త్యేక సూచ‌న చేసేందుకు విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్ నోరు విప్పి తానెందుకు వ‌చ్చింది?  బాబుకు ఏం చెప్పింది చెప్పుకునే అవ‌కాశం ఎట్టి ప‌రిస్థితుల్లో ఉండ‌దు. వీరి స‌మావేశానికి సంబంధించి బ‌య‌ట‌కు వ‌చ్చిన వివ‌రాల‌న్నీ గ‌వ‌ర్న‌ర్ ఇమేజ్ దెబ్బ తీసేలా..బాబు ఇమేజ్ పెంచేలా ఉండ‌టం చూసిన‌ప్పుడు అస‌లు విష‌యం అర్థం కాక మాన‌దు.

హోదా సాధ‌న కోసం తాము చేస్తున్న పోరాటం మోడీ మీద వ్య‌క్తిగ‌త పోరాటం ఎంత మాత్రం కాద‌ని.. విధానాల మీద మాత్ర‌మే పోరాడుతున్నామ‌ని.. ఏపీ ప్ర‌జ‌ల సెంటిమెంట్ల‌ను రాష్ట్ర స‌ర్కారు గౌర‌వించాల్సి ఉంటుంద‌ని బాబు గ‌వ‌ర్న‌ర్ కు స్ప‌ష్టం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌ల‌తో ఏపీ రాష్ట్రంలో రాజ‌కీయ వేడి పెంచ‌టం మంచిది కాద‌న్న మాట గ‌వ‌ర్న‌ర్ నోటి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్న వేళ‌.. గ‌వ‌ర్న‌ర్ మాట‌కు బాబు కౌంట‌ర్ ఇస్తూ..   రాష్ట్ర రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఎంత‌కైనా త‌గ్గేది లేద‌ని గ‌వ‌ర్న‌ర్ కు తెగేసి చెప్పిన‌ట్లుగా స‌మాచారం బ‌య‌ట‌కు రావ‌టం వెనుక అస‌లు విష‌యం అర్థ‌మైన‌ట్లే. ఈ వివ‌రాల‌న్నీ బాబుకు బ్యాక్ గ్రౌండ్ గా ఉన్న‌ట్లు చెప్పే ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ రిపోర్ట్ కావ‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News