పిడికిలి బిగించి ఉంటే.. లోపల ఏం లేకున్నా ఏదో ఉందన్న భావన కలుగుతుంది. అదే గుప్పిటను తెరిచేస్తే.. గుట్టు రట్టవుతుంది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు సైతం ఇలానే ఉంది. ప్రత్యేకహోదా మీద ఇప్పటికి పాతికసార్లు ఢిల్లీ వెళ్లానని చెప్పుకునే చంద్రబాబు.. ఈ సారి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలుస్తారా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తనకు చాలా పనులు ఉన్నాయని.. ఆ పని తమ ఎంపీలు చేస్తారని చెప్పుకొచ్చారు.
ఇదే చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదట్లో వారానికి ఒక రోజు ఢిల్లీకి కేటాయిస్తానని.. జాతీయ రాజకీయాలు.. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి ఫాలో అప్ చేసేందుకు తాను వెళ్లనున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ.. మోడీ నుంచి ఇందుకు స్పందన లేకపోవటం.. ప్రతి దానికి మీరు ఢిల్లీకి రావటం ఏమిటన్న మోడీ అసంతృప్తితో పాటు.. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి వచ్చే వాడినే కానని.. తన రాష్ట్రానికి కావాల్సిన పనులన్నీ నేతలు.. అధికారులతో పూర్తి చేసేవాడినంటూ బాబుతో చెప్పినట్లుగా చెబుతారు.
బాబుతో మోడీ అన్న ఈ మాటల సారాంశం ఏమిటో ప్రత్యేకంగా విప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఢిల్లీకి రావొద్దు. మీ స్టేట్ లొ కూర్చొని మీ పని మీరు చేసుకోవచ్చుగా?’ అని చెప్పటమే. మోడీ మాటల్లో సందేశాన్ని అర్థం చేసుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లే మాటను చెప్పటం తగ్గించేశారు. ఇక.. మోడీతో తనకు పెరుగుతున్న దూరం.. తనకిస్తున్న మర్యాద ఎంతన్నది అర్థం చేసుకున్న చంద్రబాబు.. తరచూ ఢిల్లీకి వెళ్లే తీరును తగ్గించుకున్నారు. మొన్నామధ్యన ప్రధాని మోడీతో ముఖ్యమంత్రుల భేటీ జరిగిన సదర్భంలోనూ.. మీటింగ్ ముగిసిన వెంటనే రాష్ట్రానికి తిరిగి వచ్చారే కానీ.. గతంలో మాదిరి బాబు ఢిల్లీలోనే ఉండిపోలేదు.
తాజా విలేకరుల సమావేశంలో తాను ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదని.. ప్రధాని మోడీని కలవాల్సిన అవసరం లేదని చెప్పటం ద్వారా ప్రధానితో అంత గొప్ప రిలేషన్స్ ఏమీ లేవన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. తనకు రాష్ట్రంలో బోలెడన్ని పనులుఉన్నాయని చెప్పిన చంద్రబాబు.. మరి హోదా గురించి పాతికసార్లు ఢిల్లీ వెళ్లినట్లు చెబుతారు. మరి.. అప్పుడు ఆయనకు రాష్ట్రంలోపని లేదా? హోదా అంశంపై తన ఎంపీలు చూసుకుంటారన్న ఆయన మాటల్ని చూసినప్పుడు.. మరి గతంలో అదే పనిని ఎందుకు చేయలేదో? అన్న సందేహం కలగక మానదు. ఢిల్లీకి వెళ్లను.. మోడీని కలవనన్న మాటలతో ఢిల్లీలో తనకున్న పరపతి లెక్కను బాబు చెప్పకనే చెప్పేసినట్లుగా చప్పాలి. ఇలా ఇంటి గుట్టును రట్టు చేసుకుంటే విలువ ఉండన్నవిషయాన్ని బాబు ఆలోచించటం లేదా?