లోకేష్ టీచర్ పై చంద్రబాబు అసంతృప్తి

Update: 2018-07-03 07:17 GMT
పాపం లోకేష్.. తేట తెలుగులో తేనెలొలికేలా మాట్లాడేందుకు చాలా కష్టపడుతున్నా కానీ ఎందుకో ఏమో  కాలం కలిసిరాక అభాసుపాలవుతున్నాడు. మాట్లాడుతుండగా ఏదో పెద్ద తప్పుడు మాట బయటకు రావడం.. దాన్ని సోషల్ మీడియా - మీడియా రచ్చ చేయడం పరిపాటిగా మారింది.

లోకేష్ భాషపటిమను ఎప్పుడో పసిగట్టిన నాన్న కమ్ సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ లో స్కిల్ పెంచేందుకు ఏకంగా ఓ టీచర్ ను అపాయింట్ చేశాడు. రీసెర్చ్ స్కాలర్ - టీవీ సీరియర్ రైటర్ అయిన పెద్ది రామారావును లోకేష్ కు వ్యక్తిగత తెలుగు భాష నేర్పే టీచర్ గా నియమించాడు.  ఇందుకోసం పెద్ది రామారావుకు నెలకు లక్ష రూపాయల జీతంతో పాటు ప్రభుత్వం ద్వారా సకల సదుపాయాలు కల్పించాడు. అంతేకాదు అతడికోసం ముగ్గురు సహాయక సిబ్బందిని నియమించి తెలుగులో లోకేష్ బాబును  తీర్చిదిద్దాలని ఆదేశించాడు.

కానీ ఇవేవీ పనిచేయలేదు.. తాజాగా లోకేష్ బాబు కాకినాడలో పర్యటించాడు. అక్కడ ప్రసంగించాడు. మళ్లీ ఈ ప్రసంగంలో బోలెడు తప్పులు బయటపడడం.. అది సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగిపోయాయి.

ఈ విషయం చంద్రబాబుకు తెలిసి తీవ్ర అసంతృప్తికి గురయ్యాడట.. అంతమంచి టీచర్ ను పెట్టి లక్షలు తగిలేసినా కొడుకు లోకేష్ లో ఏమాత్రం ఇంప్రూవ్ మెంట్ లేకపోవడం చూసి అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

ఈ సందర్భంగా టీచర్ రామారావును పిలిచి మీకు అప్పగించిన బాధ్యతను సరిగ్గా పూర్తి చేయలేదని.. లోకేష్ లో ఏమాత్రం పురోగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
Tags:    

Similar News