ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌కు గ్రూప్ 2 ఉద్యోగమిచ్చిన బాబు

Update: 2017-07-12 05:12 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవ‌ల తీవ్రంగా క‌దిలించిన విషాద ఉదంతంగా ల‌క్ష్మీ ప్ర‌స‌న్నది చెప్పుకోవాలి. ఎవ‌రికి ఎదురుకాకూడ‌ని దుర్మార్గ చ‌ర్య‌తో అయిన వాళ్ల‌ను పోగొట్టుకున్న ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌కు తాను అండ‌గా ఉంటాన‌ని చెప్పిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. మాట నిల‌బెట్టుకున్నారు.

తండ్రి ఉన్మాద చ‌ర్య‌తో కుటంబం మొత్తాన్ని (ఈ నెల నాలుగో తేదీన అనంత‌పురం జిల్లా తాడిప‌త్రికి చెందిన రామ‌సుబ్బారెడ్డి అనే వ్య‌క్తి త‌న భార్య‌తో పాటు.. ఇద్ద‌రు కుమార్తెల్ని దారుణంగా హ‌త‌మార్చాడు) క‌డ‌తేర్చాడు. అయితే.. ఆ స‌మ‌యంలో ఇంట్లో లేని ల‌క్ష్మీ ప్ర‌స‌న్న బ‌తికిపోయింది. తండ్రి ఉన్మాద చ‌ర్య‌కు తెలుగు ప్ర‌జ‌లు తీవ్రంగా క‌దిలిపోయారు. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న ఉదంతం చంద్ర‌బాబును తీవ్రంగా క‌దిలించింది.

ఆమెకు అండ‌గా ఉంటాన‌ని స‌భా ముఖంగా చెప్ప‌ట‌మే కాదు అప్ప‌టికిప్పుడు రూ.20 ల‌క్ష‌ల సాయాన్ని అందించారు. ఉన్న‌త చ‌దువుల‌కు ఎంత ఖ‌ర్చు అయితే అంత భ‌రిస్తాన‌ని చెప్పారు. తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబును ల‌క్ష్మీ ప్ర‌సన్న క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆమె విద్యార్హ‌త‌ల్ని అడిగారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని స‌మాధానం ఇవ్వ‌టంతో ఆమెకు గ్రూప్ 2 పోస్టు ఇవ్వ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు.  ఇందుకు త‌గిన ఆదేశాల్ని జారీ చేయాల‌ని అధికారుల్ని ఆదేశించారు కూడా.

క‌ష్టాల‌కు భ‌య‌ప‌డ‌కుండా ఎదురీదాల‌న్న చంద్ర‌బాబు.. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న ఉదంతంలో ప్ర‌భుత్వ ప‌రంగానే కాదు.. వ్య‌క్తిగ‌తంగానూ సాయం చేస్తాన‌ని చెప్పారు. ఉద్యోగంతో స‌రి పెట్టుకోకుండా మ‌రింత ఉన్న‌త స్థాయికి ఎదగాల‌న్న అభిలాష‌ను చంద్ర‌బాబు వ్య‌క్తం చేశారు. ఆర్నెల్ల‌కు ఒక‌సారి త‌న‌ను త‌ప్ప‌నిస‌రిగా క‌ల‌వాల‌ని చెప్పి.. అందుకు త‌గ్గ ఏర్పాట్లు చేయాల‌ని బాధిత యువ‌తి విష‌యంపై అధికారుల్ని ఆదేశించారు చంద్ర‌బాబు. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న ఎపిసోడ్ లో బాబు తీరు ప‌లువురిని ట‌చ్ చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News