ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మరోమారు పదవుల పందేరం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఏకకాలంలో ఇటు పార్టీ పదవులు - అటు కీలక నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు బాబు ఉద్యుక్తుడవుతున్నట్లు టీడీపీ వర్గాల విశ్వసనీయ సమాచారం. మహానాడు ముగిసి నాలుగు నెలలవుతున్నా ఇప్పటివరకూ ఏపీ - తెలంగాణ రాష్ట్ర కమిటీలు ప్రకటించలేదు. ప్రభుత్వ కార్యక్రమాలు - ఎన్నికలతో బిజీగా ఉన్నందున దానిపై దృష్టి సారించడం సాధ్యపడలేదని, ఇప్పుడు రెండు రాష్ట్ర కమిటీల ఎంపికపై బాబు కసరత్తు ప్రారంభించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. నంద్యాల - కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసినందున ఇక పార్టీపై దృష్టి సారించాలని చంద్రబాబు నిర్ణయించారు.
అయితే ఈ కసరత్తులో అందరికంటే ఆసక్తిగా మారిన పేరు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు తనయుడు హరికృష్ణ. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో ఇంకా పదవీకాలం ఉండగానే ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయనకు ఏ పదవి కట్టబెట్టలేదు. కొద్దికాలం క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా హరికృష్ణను ఎంపిక చేస్తారనే ప్రచారం సాగింది. ఈ పదవిని నందమూరి హరికృష్ణకు ఇవ్వాలని పార్టీ ప్రతిపాదించగా, ఆయన రాజ్యసభ సీటు కోరినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావుకు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. యాదవ సామాజికవర్గానికి చెందిన మస్తాన్ రావు పార్టీ అధినేత చంద్రబాబుకు విధేయుడు. యాదవ వర్గానికి ఈ పదవి ఇవ్వడం వల్ల చిత్తూరు - నెల్లూరు - గుంటూరు - కృష్ణా - విశాఖ జిల్లాల్లో ఎక్కువగా ఉన్న యాదవులను ఆకర్షించవచ్చన్న వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అన్ని కులాలకు వరాలు ప్రకటించిన బాబు.. పార్టీకి పునాదిరాళ్లయిన బీసీలను ఆకర్షించేందుకు ఈ వర్గానికే చెందిన మస్తాన్ రావుకు కీలకమైన టిటిడి చైర్మన్ ఇవ్వాలని భావిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నాయి.
మరోవైపు ఒకటి - రెండు వారాల్లో రాష్ట్ర కమిటీలను ప్రకటించవచ్చని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ‘ఇంటింటికీ తెలుగుదేశం’తోపాటు పార్టీకి సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్ ఇస్తున్నందున, వాటిని పర్యవేక్షించేందుకు తక్షణం పార్టీ కమిటీల అవసరం ఏర్పడింది. వీటికి ప్రధాన కార్యదర్శులు - కార్యనిర్వాహక కార్యదర్శులు అనుసంధానకర్తలుగా వ్యవహరించాల్సి ఉంది. దానికితోడు, ప్రతి క్యాబినెట్ సమావేశానికి ముందు పార్టీ సమన్వయ కమిటీలు నిర్వహిస్తున్నారు. వాటిలో ప్రభుత్వం తరఫున తీసుకునే నిర్ణయాలపై చర్చించి, వాటిని పార్టీకి అనుసంధానం చేస్తుంటారు. కానీ పార్టీ కమిటీలు రద్దయినందున ఆ సమన్వయ కమిటీలు కేవలం మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు పార్టీ కమిటీలపై సైతం దృష్టి సారించి వాటిని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.