జనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెలుగుదేశం పార్టీ తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధమైందా? 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా బరిలో దిగనుందా? టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజా వ్యాఖ్యల మర్మం ఇదేనా...ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతున్న చర్చ ఇది. ఓ టీవీ ఛానల్ తో మాట్లాడిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ పార్టీగా జనసేన ఎన్నికల్లో పోటీ చేయొచ్చని, ఆ పార్టీ వ్యవహారాలపై తాను ఇప్పుడేం వ్యాఖ్యానించనని చంద్రబాబు అన్నారు.
2014 ఎన్నికల సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనను తాను మద్దతు కోరలేదని తెలిపిన టీడీపీ రథసారథి చంద్రబాబు జనసేన పార్టీయే స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించారని తెలిపారు. రానున్న ఎన్నికలకు ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడడం సరికాదని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల పొత్తు అనేది ఎన్నికల ముందు జరుగుతుందని జనసేనతో కలిసే సాగే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఒక రాజకీయ పార్టీకి సిద్ధాంతాలు - విధానాలు ఉంటాయని చెప్పిన చంద్రబాబు అవన్నీ సరైన సమయంలో చర్చకు వస్తాయని పరోక్షంగా జనసేన విధానాలను ప్రస్తావించారు.
ముందస్తు ఎన్నికలు ఖాయమని ఇటీవలే పార్టీ నేతలతో స్పష్టంగా తెలిపిన చంద్రబాబు టీవీ ఛానల్ చర్చలో మాత్రం ఆ విషయాన్ని దాటవేశారు. ఇప్పుడు తాను ఎన్నికల గురించి ఆలోచించడంలేదని అన్నారు. విభజన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు పూర్తిగా అధిగమించడానికి శ్రమిస్తున్నట్లు పునరుద్ఘాటించారు. అన్ని రాష్ర్టాల కంటే ఏపీ ముందుండేలా అభివృద్ధి చేయడం తన లక్ష్యంగా చెప్పారు. తన లక్ష్యాన్ని చేరుకోవడం గురించి తప్పా మరే విషయం గురించి ఆలోచించడం లేదని బాబు విశ్లేషించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/