ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. వీలయినన్ని ఓట్లను తన ఖాతాలో వేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు పథకాల మీద పథకాలు ప్రకటించడం మామూలే గానీ... టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇస్తున్న హామీలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మక మానవు. గడచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే ఇంకా దిక్కు లేదు గానీ... కొత్తగా హామీలిచ్చేందుకు కూడా బాబు చేస్తున్న యత్నాలన్నీ దుస్సాహసం కిందే లెక్కేసుకోక తప్పదు. గడచిన ఎన్నికల్లో రైతులకు రుణ మాఫీ - డ్వాక్రా రుణాల మాఫీతో పాటు చాలా హామీలనే ఇచ్చిన చంద్రబాబు... వాటిలో మెజారిటీ హామీల అమలు జోలికి వెళ్లలేకపోయారు. ఇందుకు ప్రధాన కారణంగా నిధుల లేమే. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక లోటుతో కొత్త ప్రయాణం ప్రారంభించిన నవ్యాంధ్రకు నిధుల లభ్యత అంత ఈజీ కాలేదు. ఈ నేపథ్యంలో రైతు రుణ మాఫీపై కొంత కసరత్తు చేసిన చంద్రబాబు.... తొలి మూడు విడతల నిధులను ఎలాగోలా సర్దుబాటు చేశారు.
ఇందులో మూడో విడత నిధుల కోసం ఏకంగా అప్పులు చేశారు. తాజాగా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ... నాలుగు - ఐదు విడతల రుణ మాఫీ కోసం మొత్తం నిధులనే అప్పుగా తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలో డ్వాక్రా రుణాల మాఫీ అమలుపై మాటెత్తడానికి కూడా చంద్రబాబు సాహసించలేకపోయారు. అయితే అప్పుడే నాలుగున్నరేళ్లు పూర్తి అయిపోయాయి. మరో మూడు నెలల్లో మరోమారు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్వాక్రా మహిళలను ఊరించేందుకు నిన్న చంద్రబాబు ఏకంగా ఓ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో గడచిన ఎన్నికల్లో తాను ఇచ్చిన డ్వాక్రా రుణాల మాఫీని మాట మాత్రంగా కూడా ప్రస్తావించని చంద్రబాబు... కొత్తగా ప్రతి డ్వాక్రా మహిళకు రూ.10 వేల నగదుతో పాటు ఉచితంగా స్మార్ట్ ఫోన్ అందిస్తానని ప్రకటించారు. దీనికి ఎంతలేదన్నా రూ.15 వేల కోట్ల మేర నిధులు అవసరమని అంచనా.
ఈ హామీకి కాస్తంత ముందుగా అప్పటిదాకా ఉన్న పెన్షలన్నింటికీ రెట్టింపు సొమ్ము ఇస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు... అందుకోసం కూడా అదనంగా మరో రూ.5 వేల కోట్ల అవసరమని పరోక్షంగా చెప్పేశారు. వీటికి తోడు ఉద్యోగులకు తాయిలాలు ఎర వేస్తున్న చంద్రబాబు... అందుకోసం కూడా రూ.5 వేల కోట్లను జమ చేయాల్సిన పరిస్థితిని కల్పించారు. రైతుల రుణమాఫీ కోసమే అప్పులు చేసిన, చేస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు కొత్తగా ఇస్తున్న హామీలను ఎలా అమలు చేస్తారన్న అనుమానాలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పాత హామీల అమలుకే అప్పులు చేస్తున్న చంద్రబాబు... కొత్త హామీల కోసం ఇంకెంత మేర అప్పులు చేయాలన్నది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నగా నిలుస్తోంది.