బాబుగోరు ఉలిక్కిపడుతున్నారు

Update: 2019-02-21 05:30 GMT
ఉన్నమాటంటే ఉలుకెందుకు అనేది సామెత. అంతేమరి ఎవ్వరికైనా ఉన్నమాటంటే ఉలుకే. తమలోని లోపాల్ని ఎత్తిచూపిస్తే ఎవ్వరికైనా కాలుతుంది. అలాగే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి కూడా కాలింది. రామ్‌ గోపాల్‌ వర్మ తీస్తున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ గురించి టీడీపీ నాయకులు ఎక్కడా మాట్లాడకపోయినా.. లోలోపల మాత్రం రగిలిపోతునే ఉన్నారు. అయితే.. ఎట్టకేలకు చంద్రబాబు బయటపడ్డారు.

 టెలికాన్ఫెరన్స్‌ లో అధికారులతో మాట్లాడిన చంద్రబాబు.. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాపై సినిమా పేరు ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. ఎన్టీఆర్‌ ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని - కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలనినేతలకు సూచించారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తినిఅందరూ చాటిచెప్పాలని - అందుకే ఎన్టీఆర్‌ పై రెండు సినిమాలు వచ్చాయని చెప్పారు. అంతేకాదు.. మహానాయకుడు - కథానాయకుడు అందరికి స్ఫూర్తిదాయకమన్న చంద్రబాబు వాస్తవాలను వక్రీకరించే వారికి ప్రజలే గుణపాఠంచెబుతారని అన్నారు.

మహానాయకుడు సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక వర్మ తీస్తున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మాత్రం మార్చి మొదటివారంలో రిలీజ్‌ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరగ్గా.. వాటిని మరింతగా పెంచేదుకు వర్మ .. సోషల్‌ మీడియాలో పోల్స్‌ నిర్వహిస్తున్నారు.  ఏ సినిమా నిజాయితితో తీస్తున్నారు అనే పోల్‌ పెడితే.. ఎక్కువ పోలింగ్ శాతం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కే వచ్చాయి. దీంతో. వర్మ తెగ సంబరపడిపోతున్నాడు. టీడీపీ నాయకులకు మాత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ దగ్గరపడేకొద్దీ టెన్షన్‌ పెరిగిపోతోంది.
Tags:    

Similar News