తెలుగుదేశం పార్టీలో ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాజకీయాల్లో ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. క్రమశిక్షణకు మారు పేరుగా ఉండే పార్టీగా టీడీపీని చెప్పుకుంటుంటే...అసలు పార్టీయే ఉండాల్సిన అవసరం ఏముందని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం బలపడే చాన్సే లేదని పేర్కొంటూ పార్టీని విలీనం చేసేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలను ఆత్మరక్షణలో పడేసిన మోత్కుపల్లి నర్సింహులుపై తెలుగుదేశం పార్టీ పెద్దలు సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని వ్యాఖ్యానించిన మోత్కుపల్లి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారన్న అభిప్రాయానికి వచ్చిన టీ-టీడీపీ నేతలు జరిగిన పరిణామాలపై పూర్తి సమాచారాన్ని అధ్యక్షుడు చంద్రబాబుకు నివేదిక ద్వారా అందించారు. తగు చర్యల కోసం ఎదురుచూశారు. అయితే మోత్కుపల్లి విషయం టీడీపీ అధినేత చంద్రబాబు చేతులు ఎత్తేశారని ప్రచారం జరుగుతోంది.
టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితుల్లో...మోత్కుపల్లి విలీనం మాట ఎత్తి సంచలనం సృష్టించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఇప్పటికే భారీ ఎత్తున నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లడంతో... ఉన్న కొద్ది మంది నేతల మనో స్థైర్యం దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమయ్యింది. ఈ క్రమంలో అసంతృప్త నేత మోత్కుపల్లి నర్సింహులుపై టీడీపీ నేతలు ఫైర్ అయి ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ పరిణామాలపై పార్టీ నేతలు సుదీర్ఘంగా చర్చించడంతో పాటు అమరావతి నుంచి వచ్చే ఆదేశాలను పాటించాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే మోత్కుపల్లి వ్యాఖ్యలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నా టీడీపీ అధినేత - ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి చర్యలు నేరుగా తీసుకోలేదు! కనీసం చర్యలకు అనుమతి ఇవ్వలేదు!! దీంతో బాబు చేతులు ఎత్తేశారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయంటున్నారు.
33 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ అనుభవంలో దళిత నాయకుడిగా వెలుగు వెలిగిన మోత్కుపల్లి నేడు ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్నట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటుగా తెలుగుదేశం పార్టీ ఊరించి ఆశలు రేపిన గవర్నర్ గిరీ విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆ పదవి ఇక రాదని మోత్కుపల్లికి అర్థమైందని అంటున్నారు. అమరావతిలో మంచి ఇల్లు కేటాయించాలని, ఇక్కడే ఉండిపోతానని చెప్పినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నుంచి స్పందన రాలేదట. దీంతో మోత్కుపల్లి తన ఆవేదనను ఈ రూపంలో వెళ్లగక్కారని అంటున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎంట్రీ ఇచ్చి మోత్కుపల్లిపై చర్యలకు సిద్ధమైతే...అది రచ్చ రచ్చ అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. అలాంటి విపరిణామాన్ని ఊహించే...ఇంత సీరియస్ కామెంట్లు చేసినప్పటికీ బాబు చేతులు ఎత్తేశారని చెప్తున్నారు.