పరిహారమా..పరిహాసమా?

Update: 2018-11-06 01:30 GMT
తిత్లీ బాధితులకు నష్టపరిహారం ఇస్తున్నాం.. వారి కష్టాన్ని మేము తొలగిస్తాం.. ఏ మాత్రం బాధ పడాల్సిన పనిలేదు.. ఇదీ రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాట. గూడు కూలి - సర్వం కోల్పోయి గోడు మాత్రమే మిగిలిన బాధితులు బాధ పడకూడదట. రాష్ర్ట ప్రభుత్వం విదిల్చే అరకొర సాయంతో సంతోషంగా ఉండాలట. కొబ్బరి చెట్టకు 15వందల రూపాయల నష్టపరిహరం. ఏళ్ళ తరబడి పెంచుకున్న చెట్టు కూలిపోతే ప్రభుత్వం ఇస్తోన్న సాయమిది. ఇప్పటికే హుద్ హుద్ బాధితుల కళ్ళల్లో నష్టాల కన్నీళ్ళు ఇంకా ఇంకిపోలేదు. ఒకట్రెండు రోజుల పాటు సిఎం చంద్రబాబు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ఏర్పాటు చేసిన ఏసీ గదుల్లో కూర్చుని మొసలి కన్నీరు కార్చారు.

సి.ఎం సారు తమ ప్రాంతానికొచ్చి భరోసా ఇచ్చేసరికి బాధితులు నిజమేనని నమ్మారు. తీరా చూస్తే.. నెలలు గడిచాయి - సంవత్సరాలు గడిచాయి.. హుద్ హుద్ బాధితులందరికీ న్యాయం మాత్రం జరగలేదు. అప్పట్లో గూడు కోల్పోయిన ఎందరో అభాగ్యులు ఇప్పటికీ వలసల పట్టాలపై బతుకు ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పుడు తిత్లీ వంతు వచ్చింది. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. బాధితుల సంఖ్య సక్రమంగా లెక్కించకుండానే.. నష్టం అంచనాలు పూర్తిగా తెలుసుకోకుండానే.. నష్టపరిహారం ఇస్తారట. తుపాను బాధితులు ధైర్యంగా ఉండాలంట. తమ కష్ట నష్టాలనూ రాజకీయాల కోసం వాడుకోవడం దారుణమని తిత్లీ బాధుతులు వాపోతున్నారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ రాష్ర్ట ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మా కన్నీళ్ళ శాపం తగిలి తీరుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. పరిహారం ఇస్తున్నట్టు పెద్దగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు నిజానికి తమ జీవితాలతో పరిహాసమాడుతున్నారని ఆవేదన చెందుతున్నారు..
Tags:    

Similar News