బాబుపై అదిరిపోతున్న వైర‌ల్ షాట్స్

Update: 2017-04-14 17:15 GMT
సుత్తి లేకుండా సూటిగా అడిగేస్తున్న కొన్ని ప్ర‌శ్న‌లు ఇప్పుడు వైర‌ల్ షాట్స్ గా మారాయి. నిత్యం నీతుల‌తో కాలం గ‌డిపేసే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట‌ల‌కు.. చేత‌ల‌కు మ‌ధ్య‌నున్న వ్య‌త్యాసాన్ని తాజాగా వైర‌ల్ అవుతున్న ఒక మెసేజ్ విప‌రీతంగా ఆక‌ర్సిస్తోంది. బాబు చ‌రిత్ర మొత్తాన్ని సింపుల్‌ గా చెప్పేస్తున్న ఈ వైర‌ల్ మెసేజ్ లో కావాల్సినంత లాజిక్ ఉండ‌టం ఒక విశేషంగా చెప్పాలి.

నిత్యం లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ వంద‌లాది మెసేజ్‌ లు ప్ర‌తి ఒక్క‌రూ చూస్తున్న‌దే. కానీ.. కొన్ని మాత్రం విప‌రీతంగా పాపుల‌ర్ అవుతాయి. తాజాగా చెప్ప‌నున్న ఈ పోస్టింగ్ ఆ కోవ‌కు చెందిందే. చంద్ర‌బాబును 365 డిగ్రీల్లో విప్పి చెప్పే ఈ పోస్టింగ్‌ లో అంత విశేషం ఏముంద‌న్న‌ది చూస్తే..

"అంద‌రినీ సాక్షి చ‌ద‌వొద్దంటావు.. నువ్వు మాత్రం చ‌దువుతూ అడ్డంగా బుక్ అవుతావు

నీతి.. నిజాయితీ అంటావు.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికేస్తావ్‌

విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయం అంటావు.. విప‌క్ష ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులిస్తావ్‌

ప‌క్క రాష్ట్రంలోని జంపింగ్‌ ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభం అంటావు.. నీ రాష్ట్రంలో అదే ప‌ని చేస్తావ్‌

మేన‌రికాలు వ‌ద్దంటావు.. కొడుక్కి మాత్రం మేన‌రిక‌మే ముద్దంటావు

మామ‌కు వెన్నుపోటు పొడుస్తావు.. మామ ఫోటోనే చూపించి ఓట్లు అడుగుతావు

మామ‌కి పార్టీ పెట్ట‌మ‌ని చెప్పింది నేనేన‌ని చెబుతావు.. మామ మీద‌నే పోటీ చేస్తాన‌న్నావ్‌

అంద‌రూ అమ‌రావ‌తికి ర‌మ్మంటావ్‌.. హైద‌రాబాద్ లో ప్యాలెస్ క‌ట్టేస్తావ్‌!"

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News