జాబు రావాలంటే బాబు రావాలి..ఒకవేళ ఉద్యోగం రాకపోతే.. భృతి చెల్లిస్తామని ఎన్నికల వేళ హామీలు గుప్పించి యువతరం ఓట్లతో అధికార పీఠమెక్కిన టీడీపీ సర్కారుకు దాదాపు మూడున్నరేళ్ల తర్వాత నిరుద్యోగులు గుర్తుకు రావడం ఒకవైపు పలువురిని ఆశ్చర్యంలో పడేయగా...అందులోనూ అనేక లొసుగులు ఉన్నాయని పలువురు చెప్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులుండగా కేవలం తొమ్మిది లక్షల మంది మాత్రమే నిరుద్యోగులున్నారని ప్రకటించడం ఇందులో స్పష్టంగా కనిపిస్తున్న ఎత్తుగడ అని చెప్తున్నారు. ఈ ఒక్క ఉదాహరణ చూసినా నిరుద్యోగ భృతి ఇచ్చామనిపించుకునేందుకు, యువతలో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు చేసే ప్రయత్నం మినహా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా కనిపించడం లేదని అంటున్నారు.
2014 ఎన్నికల సందర్భంగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న లెక్కల ప్రకారం చూసిన నిరుద్యోగ భృతి విషయంలో సర్కారు మాయ చేయడం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులు పూర్తి చేసి ఏటా బయటకు వస్తున్న 3.2 లక్షల మంది యువతీయువకులలో 75 శాతం మంది సరైన నైపుణ్యత లేక ఉపాధి పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. ఆ లెక్కన ప్రతి ఏటా కనీసం 2.6 లక్షల మంది నిరుద్యోగ సైన్యంలో చేరుతున్నారు. ప్రభుత్వం మాత్రం డిగ్రీ కలిగిన మొత్తం నిరుద్యోగల సంఖ్య 2,63,280 మంది మాత్రమేనని చెబుతుండటం గమనార్హం. రాష్ట్రంలో ఎంప్లాయిమెంట్ ఎక్స్ చేంజీల్లో పేర్లు నమోదు చేసుకున్నవారిలో పదో తరగతి లోపు 22,195 మంది, పది ఉత్తీర్ణతతో 2,45,673 మంది, ఇంటర్ 2,56,658 మంది, డిగ్రీ పాసైనవారు 2,63,280 మంది, అంతకన్నా ఎక్కువ అర్హతలున్నవారు 92,878 మంది మొత్తం 8,80,684 మంది నిరుద్యోగులున్నారు. ఇప్పుడు ఈ 8.8 లక్షల మందికే భృతి అందజేస్తారన్నమాట. 30 లక్షల మంది నిరుద్యోగుల్లో మిగిలినవారి సంగతేంటి? అనేదానికి పాలకులే సమాధానం ఇవ్వాలి.
35 ఏళ్ల లోపు వారికే భృతి అందజేస్తామనడంలోనూ సహేతుకత కానరావడం లేదు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత నోటిఫికేషన్ల ప్రకారం చూసినా 42 ఏళ్ల లోపు వయసున్నవారందరినీ నిరుద్యోగులుగా పరగణించాలి. చదువు, వయసుతో పాటు ప్రభుత్వం ప్రతిపాదించిన మిగిలిన షరతులు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. భృతి తీసుకునే వారు తప్పనిసరిగా ప్రభుత్వం అందించే శిక్షణకు హాజరుకావాల్సివుంటుందనీ, శిక్షణ కాలంలో మూడు రోజులు గైర్హాజరయితే భృతి నిలిపేయాలని ప్రతిపాదించారు. అంటే ప్రభుత్వం అందజేసేది అప్రెంటీస్ లకు అంజేసే స్టయిఫండా లేక నిరుద్యోగ భృతా అనే సందేహం కలుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పీఠమెక్కి మూడున్నరేళ్లు అవుతున్నా జాబు రాలేదు కాదు కదా..ఉన్న ఉద్యోగాలే ఊడి వేలాది మంది వీధిన పడ్డారు. ప్రతి ఏటా డీఎస్సీ విడుదల చేస్తామన్న పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నోటిఫికేషన్ నే కొనసాగించారే మినహా ఈ మూడేళ్లలో కొత్తగా ఒక్కటంటే ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన పాపాన పోలేదు. 'ఉద్యోగ మిత్ర' పథకం తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఉద్యోగమిస్తామన్న చంద్రబాబు హేతుబద్దీకరణతో వేలాది పాఠశాలలను మూసివేసి అటు విద్యార్థులకు - ఇటు ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేయడం ద్వారా 'ఉద్యోగ శత్రు'వయ్యారంటే అతిశయోక్తి కాదేమో. అంతర్జాతీయస్థాయిలో ఏర్పాటు చేస్తామన్న నైపుణ్యాభివృద్ధి కేంద్రం, ప్రతి కళాశాలలో ప్లేస్ మెంట్ సెల్ ఏర్పాటు వంటివన్నీ నీటి మీద రాతలయ్యాయి.