సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ దాదాపుగా ముగిసిపోయింది. ఏడు విడతల సుధీర్ఘ షెడ్యూల్ లో భాగంగా చివరి దశ అయిన ఏడో దశ పోలింగ్ నేటి ఉదయం ప్రారంభమై కాసేపటి క్రితమే ముగిసింది. ఏడో దశలో మొత్తం 59 నియోజకవర్గాలకు పోలింగ్ జరగగా... చాలా చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నా... మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందని చెప్పాలి. సరే... పోలింగ్ ముగిసిందంటే... ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేస్తాయి. కదా. అందులోనూ నేటితో పోలింగ్ ముగిస్తే... కౌంటింగ్ మాత్రం ఈ నెల 23న జరగనుంది. అంటే... ఇంకో నాలుగు రోజులన్న మాట.
సార్వత్రికం పరిస్థితి ఇలా ఉంటే... ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలపై ఇప్పటికే పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి. జాతీయ సర్వేలన్నీ విపక్ష వైసీపీదే విజయమని చెబుతుంటే... ఒక్క లగడపాటి రాజగోపాల్ మాత్రం టీడీపీ గెలుస్తుందని చెబుతున్నారు. కౌంటింగ్ కు సమయం దగ్గరపడటం - ఎగ్జిట్ ఫలితాల సందడి చేయడానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన పార్టీ శ్రేణులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న చంద్రబాబు.. నేటి ఉదయం పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసి ఏ ఒక్కరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారట.
అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కూడా వైసీపీకే అనుకూలంగా ఉంటాయని కూడా ఆయన చెప్పారట. మరి విపక్ష పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తుంటే... ఆందోళన చెందకుండా ఎలా అని అడిగితే... ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నా... కౌంటింగ్ లో గెలుపు మాత్రం టీడీపీదేనని ఆయన తేల్చేశారు. ఇదెక్కడి లెక్క అని ఆరా తీస్తే... 2014 ఎన్నికలను ఆయన ప్రస్తావిస్తున్నారట. నాడు కూడా దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వైసీపీనే గెలుస్తుందని చెబితే... కౌంటింగ్ లో మాత్రం విజయం టీడీపీని వరించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారట. 2014లో మదిరిగానే ఇప్పుడు కూడా ఎగ్జిట్ ఫలితాలన్నీ వైసీపీకి అనుకూలంగా వచ్చినా... గెలుపు మాత్రం టీడీపీకే సొంతమవుతుందని చంద్రబాబు చెప్పారట.
ఇక టీడీపీ గెలుపునకు సంబంధించిన లెక్క కూడా చంద్రబాబు చెప్పారట. తన ఐదేళ్ల పాలనలో సంక్షేమాన్ని పరుగులు పెట్టించానని - చివరలో ప్రారంభించిన పసుపు కుంకుమ - అన్నదాతా సుఖీభవ - పింఛన్ల పెంపుతో లబ్ధిదారుల్లో 60 శాతం మంది టీడీపీ వైపే మొగ్గు చూపారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా... పోలింగ్ లో ఎన్ని అవాంతరాలు ఎదురైనా క్యూలలో గంటల తరబడి నిలుచుని మరీ ఓట్లు వేసిన తీరును చూస్తుంటే... అది పక్కాగానే టీడీపీకి పడిందని కూడా ఆయన చెబుతున్నారట. మొత్తంగా టీడీపీ నేతలకు ఎగ్జిట్ టెన్షన్ లేకుండా చంద్రబాబు పక్కా ప్లాన్ వేశారన్న మాట.