ప‌వ‌ర్ లేకుంటే ఇదే మాట‌ను చెప్పే వాడివా బాబు?

Update: 2017-04-09 05:43 GMT
ప‌వ‌ర్ లో ఉన్న‌ప్పుడు ఒక మాట‌.. ప‌వ‌ర్ చేతిలో లేన‌ప్పుడు మ‌రో మాట చెప్ప‌టం రాజ‌కీయ నాయ‌క‌ల‌కో అల‌వాటు. తాజాగా చంద్ర‌బాబు కొత్త ప‌ల్ల‌విని వినిపిస్తున్నారు. దేశంలో ఎన్నిక‌ల‌న్నీ ఒకేసారి జ‌ర‌గాల‌న్న‌ది ఆయ‌న మాట‌. ఎందుక‌లా అంటే.. ఎన్నిక‌లు త‌ర‌చూ జ‌ర‌గ‌టం వ‌ల్ల స‌మ‌యం వృధా అని.. అభివృద్ధి కార్య‌క్ర‌మాలు కుంటుబ‌డుతున్న‌ట్లుగా ఆయ‌న వాపోతున్నారు. ఎన్నిక‌లన్నీ ఒకేసారి ఏడాది వ్య‌వ‌ధిలో పూర్తి చేసేస్తే.. మిగిలిన నాలుగేళ్లు అభివృద్ధిపైన దృష్టి పెట్టొచ్చ‌న్న భావ‌న‌ను వ్య‌క్తం చేశారు.

ఆలోచ‌న రూపంలో చూసిన‌ప్పుడు బాబు నోటి వెంట వ‌చ్చిన ఈ ప్ర‌తిపాద‌న భ‌లే ఉంద‌న్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు. కానీ..ఈ విష‌యాన్ని కాస్తంత లోతుగా ఆలోచిస్తే.. బాబు ప్లాన్ ఏమిటో అర్థం కాక మాన‌దు. ఎన్నిక‌ల‌న్నీ ఏడాది లోపు పూర్తి చేసేస్తే.. మిగిలిన నాలుగేళ్లు అభివృద్ధి మీద దృష్టి పెట్టొచ్చ‌న్న మాటే నిజ‌మ‌ని అనుకుందాం.. ఈ మాట‌ను చంద్ర‌బాబు.. ప‌వ‌ర్ లో లేన‌ప్ప‌పుడూ కూడా చెబితే న‌మ్మొచ్చు.

ప‌వ‌ర్ లో ఉన్న‌ప్పుడు ఒక తీరులో.. అది లేన‌ప్పుడు మ‌రో తీరులో మాట్లాడ‌టం బాబుకు అల‌వాటేన‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

ఎన్నిక‌ల‌న్నీ ఒకే ఏడాదిలో జ‌రిగితే న‌ష్టం ఏమిట‌న్న‌ది చూస్తే.. ఏదైనా ప్ర‌భుత్వం కొలువు తీరిన త‌ర్వాత‌.. మ‌ధ్య‌మధ్య‌లో వ‌చ్చే ఎన్నిక‌లు అధికార‌ప‌క్ష బ‌లాన్ని.. బ‌ల‌హీన‌త‌ను.. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షానికి గ‌ళం విప్పేందుకు అవ‌కాశం ఇచ్చేలా చేస్తాయి.

ఒక‌వేళ‌..ఎన్నిక‌ల కార‌ణంగా అభివృద్ధి కార్య‌క్రమాల‌న్నీనిలిచిపోతాయ‌న్న‌ది నిజ‌మే అనుకుంటే.. మ‌ద్య‌లో నిర్వ‌హించే ఉప ఎన్నిక‌ల్ని కూడా ర‌ద్దు చేయాల్సిందే. అందుకు త‌గ్గ‌ట్లు నిబంద‌న‌ల్ని మారిస్తే మంచిది. ఎన్నిక ఏదైనా ఎన్నికేన‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. మామూలు ఎన్నిక ఒక‌టి.. ఉప ఎన్నిక మ‌రొక‌టిగా చూడ‌టంలో అర్థం లేదు. ఎందుకంటే.. ఎన్నికలు జ‌రిగితే అభివృద్ధి ఆగిపోతుంద‌న్న ఆలోచ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ప్పుడు ఉప ఎన్నిక విష‌యంలోనూ మిన‌హాంపు ఇవ్వ‌కూడ‌ద‌న్న‌ది మ‌ర‌వ‌కూడ‌దు.

ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో అధికార‌ప‌క్షానికి ఉండే ప‌వ‌ర్ కు.. వారికుండే దూకుడ్ని బ్రేకులు వేసేది ఎన్నిక‌లేన‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అప్పుడ‌ప్ప‌డు జ‌రిగే ఎన్న‌క‌లు విజిల్ బ్లోయ‌ర్స్ మాదిరి ప‌ని చేస్తుంటాయ‌న్నది ఎవ‌రుఅవున‌న్నా.. కాద‌న్నానిజ‌మ‌ని చెప్పాలి. అలాంట‌ప్పుడు ఎన్నిక‌ల్నిగుండు గుత్తుగా ఒకేసారి నిర్వ‌హించాల‌న్న వాద‌న‌లో అర్థం లేద‌న్న‌ది నిజం. ఎన్నిక‌ల‌న్నీ ఒకే ఏడాదిలో నిర్వ‌హించాల‌న్న మాట‌ను చెబుతున్న చంద్ర‌బాబు.. తాను ప‌వ‌ర్ లో లేన‌ప్పుడూ ఇదే వాద‌న‌ను వినిపిస్తే ఎంతో కొంత న‌మ్మొచ్చు. నిజానికి బాబు వినిపిస్తున్న వాద‌న‌కు న‌ష్టం బాబుకే. ఇప్పుడుఅధికారంలోఉన్నా.. రేపొద్దున విప‌క్షంలో ఉన్న వేళ కూడా.. ఇదే రూల్ ను కానీ అమ‌లు చేయాల‌ని కోరితే ఓకే అనొచ్చు. ఇప్పుడు తెగ హ‌డావుడి ప్ర‌ద‌ర్శిస్తున్న బాబు.. ఫ్యూచ‌ర్ లో కూడా ఇంతేలా ఆస‌క్తి వ్య‌క్తం చేస్తే అప్పుడు త‌ప్ప‌నిస‌రిగా ఆలోచించొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News