అవకాశం వచ్చినప్పుడే తామేంటో చూపించే తత్వం కొందరు రాజకీయ నేతల్లో కనిపిస్తుంది. టైం బాగోలేనప్పుడు వెయిట్ చేసే ధోరణికి ప్రాధాన్యత ఇచ్చే నేతలు.. తమదైన టైంలో ఎలా వ్యవహరిస్తారనటానికి తాజా ఉదంతం ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. జాతీయ రాజకీయాల్లో కీలకభూమిక పోషించాలన్న కోరిక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాస్త ఎక్కువే. నిజానికి ఆ విషయాన్ని ఆయన ఎప్పుడూ దాచుకున్నది లేదు. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా.. జాతీయ పార్టీలతో కలిసిమెలిసి ఉండటం.. వారిలో తాను యాక్టివ్ గా ఉండాలనుకోవటం తప్పేం కాదు. కానీ.. మోడీ లాంటి నేత బాబు లాంటి వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు తప్పించి.. ఎక్కువ అవకాశం ఇవ్వరన్న విషయాన్ని మర్చిపోకూడదు.
దీనికి తగ్గట్లే మోడీ పవర్ లోకి వచ్చిన తర్వాత.. తరచూ ఢిల్లీకి వెళ్లే అలవాటు ఉన్న బాబును తనదైన శైలిలో డీల్ చేసి.. దేశ రాజధాని వంక చూసేందుకు సైతం ఇష్టపడని రీతిలో బాబును తయారు చేసిన వైనాన్ని మర్చిపోకూడదు. తరచూ ఢిల్లీ వెళ్లి.. కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అలవాటు ఉన్న చంద్రబాబు.. గడిచిన కొద్ది కాలంగా అవసరానికి ఢిల్లీకి వెళ్లటం.. పని పూర్తి అయిన తర్వాత వెనువెంటనే తిరిగి వచ్చేయటం కనిపిస్తోంది. బాబుతో పోలిస్తే.. కేసీఆరే రెండు రోజులు ఢిల్లీలో అదనంగా ఉన్నట్లు కనిపించక మానదు.
నోట్ల రద్దు నేపథ్యంలో.. ఈ అంశంపై చోటు చేసుకుంటున్న పరిణామాలు.. వాటి విషయంలో ఏమేం చేయాలన్న అంశంపై కేంద్రానికి సలహాలు.. సూచనలు చేసేందుకు వీలుగా.. ఆరుగురు ముఖ్యమంత్రులతో కూడిన ఒక కమిటీ ఒకటి వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసి మరీ.. ఆయన్ను కమిటీకి సారథ్యం వహించాల్సిందిగా కోరటం మర్చిపోకూడదు.
ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు పాజిటివ్ గా మాత్రమే రియాక్ట్ అయ్యే చంద్రబాబు.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నట్లుగా చెబుతున్నారు. జైట్లీ ఫోన్ చేసి ఆరుగురు ముఖ్యమంత్రులు ఉన్న కమిటీకి సారథ్యం వహించాలని కోరితే.. ఆలోచించి చెబుతానని చెప్పారే కానీ.. ఓకే అని చెప్పకపోవటం గమనార్హం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కమిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేరకపోవటమే మంచిదన్న భావనను తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రద్దు నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహంతో ఉన్న వేళ.. అలాంటి కమిటీలో భాగస్వామ్యం అంటే ప్రజల్లో నెగిటివ్ అయ్యే అవకాశం ఉందని.. అందుకే.. దీనికి దూరంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే.. ఇప్పటివరకూ సారథ్యం బాధ్యతల్ని స్వీకరించే అంశాన్ని బాబు పెండింగ్ పెట్టటం చూస్తే.. తన నిర్ణయంతో మోడీకి షాక్ ఇచ్చేందుకు బాబు సిద్ధమవుతున్నారా? అన్న భావన కలగటం ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/