బాబు ఫ్యామిలీతో ఘట్టమనేని బంధం బలపడింది

Update: 2015-12-07 03:34 GMT
రెండు పెద్ద కుటుంబాల మధ్య స్నేహం వేరు. బంధుత్వం వేరు. స్నేహం బంధుత్వంగా మారితే ఆ బలమే వేరు. తాజాగా అలాంటిదే చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇంతకీ ఆ రెండు కుటుంబాలేమంటే.. చంద్రబాబు.. ఘట్టమనేని కృష్ణ ఫ్యామిలీలుగా చెప్పొచ్చు. 2014 ఎన్నికల ముందు వరకూ బాబుకు.. ఘట్టమనేని కృష్ణకు మధ్య సంబంధాలే లేవు. రాజకీయంగా వారిద్దరూ విరుద్ధ భావాలున్న వారే. కానీ.. ఘట్టమనేని ఇంటి అల్లుడు గల్లా జయదేవ్ కు గుంటూరు ఎంపీ కేటాయించటంతో బంధం మొదలైంది. తాజాగా అది బంధురికంగా మారిందంటున్నారు.

చంద్రబాబు సోదరి హైమావతి మనమరాలు ప్రియాంక.. ఘట్టమనేని (సూపర్ స్టార్) కృష్ణ  సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కుమారుడు రత్నబాబుల వివాహం నిశ్చయమైంది. బాబుకు ఇద్దరు సోదరీమణులు కాగా.. వారిలో హైమావతి ఒకరు. ఇక వధూవరుల విషయానికి వస్తే.. ప్రియాంక ఇటీవలే ఇంజనీరింగ్ పూర్తి చేయగా.. రత్నబాబు చదవు పూర్తి చేసుకొని ప్రస్తుతం వ్యాపారాలు చూసుకుంటున్నారు. వీరి మధ్య ఫిక్స్ అయిన పెళ్లితో రెండు కుటుంబాల మధ్య కొత్త బంధుత్వం  షురూ అయినట్లే. వ్యక్తిగతంగా బంధువులు అయ్యాక.. రాజకీయంగా మాత్రం దూరంగా ఉంటారా ఏంటి?
Tags:    

Similar News