అనుకున్నదే జరిగింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఏదో అవుతుందని ఆశించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమీ కాదన్న విషయం అర్థమైంది. తాము పెట్టిన అవిశ్వాస తీర్మానంతో మోడీ పరివారంపై విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేయాలన్న ప్రయత్నం పాక్షికంగా ఫలించినా.. మనం రెండు దెబ్బలేస్తే.. అవతలోడు ఒక్క దెబ్బ వేయడా? అన్న రూల్ ను మోడీ పక్కాగా ఫాలో అయ్యారు.
శుక్రవారం ఉదయం 11 గంటల వేళ ఫ్రెష్ గా స్టార్ట్ అయిన పార్లమెంటులో గల్లా జయదేవ్ మాటల ప్రభావం కాసేపు ఉన్నా.. ఎప్పుడైతే రాహుల్ గాంధీ నాటకీయ పరిణామాలతో సీన్ మొత్తం మారిపోయింది. ఏపీ ప్రత్యేక హోదాను పట్టించుకున్న నాథుడే లేడు. అన్నింటికి మించి సోషల్ మీడియాలో వైరల్ కావటానికి సరిగ్గా సరిపోయే మసాలా రాహుల్ కౌగిలింత.. కన్నుగీటతో సీన్ మొత్తం మారింది.
అప్పటివరకూ గంభీరంగా ఉన్న వ్యవహారం రాహుల్ పుణ్యమా అని ఎటకారంగా మారిపోయింది. ప్రత్యేక హోదా అంశం పక్కకు వెళ్లిపోయింది. జాతీయరాజకీయ అంశాలుతెర మీదకు వచ్చాయి. బీజేపీకి కానీ కాంగ్రెస్ కు కానీ కావాల్సింది వారి.. వారి మైలేజీనే తప్పించి ఏపీ ప్రజలు గోడు.. వారి ఆశలు.. ఆకాంక్షలు ఎంతమాత్రం కాదు. ఇదే విషయాన్ని తమ మాటలతోనూ.. చేతలతోనూ చేసి చూపించారు మోడీ.. రాహుల్ ఇద్దరూ.
హోదా విషయాన్ని కంటితుడుపుగా ఎవరికి వారు ప్రస్తావించి.. ఆ వెంటనే ఆ ఇష్యూను పక్కదారి పట్టించేశారు. సభలో హీట్ పుట్టేలా ఒకరిపై ఒకరు కౌంటర్లు వేశారు. తనపై రఫెల్ మచ్చను వేసే ప్రయత్నం చేసిన రాహుల్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మోడీ. దీంతో.. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో హోదా అంశం పక్కకు వెళ్లిపోయింది. ఏమీ తేలకుండా సభ వాయిదా పడింది.
హోదా మీద మోడీ ఏదో ప్రకటన చేస్తారన్న ఆశ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా.. ఎవరికి లేదు. అయితే.. కంటితుడుపుగా అయినా ఏదైనా మాట ఉంటుందన్న ఆశ కొంత ఉండేది. నిన్నటితో అది కూడా పోయినట్లే. ఈ కారణంతోనే కావొచ్చు.. అవిశ్వాసం మీద ఓటింగ్ జరిగాక సీఎం చంద్రబాబు నోటి నుంచి వచ్చిన మాటలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి.
అవిశ్వాసంతో ప్రభుత్వం పడిపోదని తమకు తెలసని.. ఎన్డీయే ప్రభుత్వానికి బలం ఉందని.. కానీ.. రాష్ట్రానికి న్యాయం కోసమే అవిశ్వాస తీర్మానం పెట్టామని.. కానీ ఫలితం లేకుండా పోయిందన్నారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం అర్థరాత్రి వేళ చంద్రబాబు మాట్లాడారు. ఆయన మాటల్లో ముఖ్యమైన అంశాల్ని చూస్తే..
- అహంకారంతో అవిశ్వాస తీర్మానం పెట్టారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అనడం సరికాదని, అధికారం ఉందనే ధీమాతో ప్రధానే అహంకారంతో మాట్లాడుతున్నారు. ‘‘నాకు - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గొడవలున్నాయని ప్రధాని మాట్లాడారు. ఆయన అలా చెప్పడం కరెక్టు కాదు. ఏపీ - తెలంగాణ మధ్య గొడవలు లేకుండా నన్ను - కేసీఆర్ ను కూర్చోబెట్టి మాట్లాడాలని చెప్పినా ప్రధాని పట్టించుకోలేదు. సమస్యను పరిష్కరించాలని చెబితే ఆ కోణంలో ఆలోచించకుండా రాజకీయ ఎదురుదాడి చేస్తున్నారు’’
- రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఎంతో ఆసక్తిగా - ఈసారైనా న్యాయం చేస్తారని చూసినా నిరాశే ఎదురైంది. ‘‘ఏపీ అంటే ప్రధాని చులకనగా మాట్లాడారు. నేనేదో యూటర్న్ తీసుకున్నానని చెబుతున్నారు. ప్రధాని మోదీని ఎదుర్కోవడానికి, ఆయన్ని గద్దె దించడానికే అవిశ్వాసం పెట్టినామట... అహంకారంతో నో కాన్ఫడెన్స్ పెట్టామట.. అహంకారం నాకు కాదు. ప్రధానికే’’. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరుతూ అన్ని ప్రయత్నాలు చేశాం. ఫలితం లేకపోవడంతో చివరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానం పెట్టాం.
- ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మాట్లాడలేదు. మోడీ మాట్లాడుతూ మన దేశభక్తిని శంకించారు. ఇది ఆక్షేపమనీయం. అవిశ్వాస తీర్మానానికి సహకరించిన వారికి థ్యాంక్స్. నాపై మోడీ ఎదురుదాడి చేశారు, ఆ మాటలు బాధించాయి బీజేపీ ప్రభుత్వం నీతి తప్పింది. ధర్మాన్ని పాటించలేదు.
- నేను యూటర్న్ తీసుకున్నట్లుగా కూడా మాట్లాడారన్నారు. అవిశ్వాసం పెట్టిన మాకు కాదు. ప్రధానికే అహంకారం. ప్రధాని చాలా చులకనగా మాట్లాడారు. ప్రధాని స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడారా? ఏపీకి అన్యాయం జరిగింది కాబట్టే చివరి అస్త్రంగా అవిశ్వాసం ప్రయోగించాం. ఏపీ ప్రజల సెంటిమెంటును పట్టించుకోలేదు. తెలుగు జాతి అంటే లెక్క లేకుండా మాట్లాడారు.
- కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పే ప్రధానమంత్రి నాలుగేళ్లుగా ఒక్కపని కూడా చేయకుండా అన్యాయం చేయలేదా?. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం నిబంధనలు అడ్డువచ్చాయని ప్రధాని చెప్పడం సరికాదు. ప్రధాని స్థాయి వ్యక్తి చవకబారుగా మాట్లాడటం చూసి బాధవేసింది.
- రాష్ట్రానికి న్యాయం చేస్తానని కనీసం 10 నిమిషాలు ఎందుకు మాట్లాడలేకపోయారు. ‘‘ఆ అహంభావం ఎందుకు? అరవై ఏళ్లు కష్టపడ్డాం. న్యాయం చేయమని అడిగాం. అందులో తప్పేముంది? రాష్ట్ర విభజన జరిగినా అందరం కష్టపడి రెండంకెల వృద్ధి రేటు సాధించాం. అయినప్పటికీ దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలకంటే ఆదాయంలో వెనుకబడి ఉన్నాం.. ఆదుకోవాల్సిన బాధ్యత మీకు లేదా?’’. న్యాయం చేయాలని 29 పర్యాయాలు ఢిల్లీ చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు.
- ప్రత్యేక హోదాకు ఇచ్చే అన్ని రకాల ప్రయోజనాలతో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే అంగీకరించాం. చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా అన్ని పార్టీలు ఒక్కటయ్యాయి. ఇది ఎంతో అరుదైన విషయం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. న్యాయం జరిగేవరకూ ఆందోళ నలు చేస్తూనే ఉంటాం.
- మోడీ తీరుకు నిరసనగా శనివారం రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టాలి. ఢిల్లీ వెళ్లి అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపి, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నేషనల్ మీడియాకు వివరిస్తా.