తన మాటలతో.. చేతలతో నిత్యం వార్తల్లో ఉండే ఏపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. మరోసారి తనలోని తేడా కోణాన్ని ప్రదర్శించారు. ఓపక్క హోదా సాధనతో పాటు.. ఏపీకి ఇచ్చిన విభజన హామీల సాధనం కోసం ఢిల్లీలో అధికార.. విపక్ష ఎంపీలంతా నిరసన చేస్తున్న వేళ.. ఆయన ఢిల్లీని వదిలేసి ఏపీ రాజధాని అమరావతికి రావటం ఆసక్తికరంగా మారింది.
ఓపక్క పార్లమెంటు సమావేశాలు సాగుతున్నాయి. ఎంపీగా ఉన్న జేసీ.. ఢిల్లీలోని జరుగుతున్న సమావేశాలకు హాజరు కావాల్సి ఉంది. కానీ.. అక్కడ డుమ్మా కొట్టిన జేసీ.. ఏపీ అసెంబ్లీ సమాశాల సందర్భంగా లాబీలకు వచ్చారు. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా జేసీపై బాబు సెటైర్ వేశారు.
బడి ఎగ్గొడితే ఫెయిల్ అవుతారని వ్యాఖ్యానించిన బాబు మాటను.. మీడియా ముందకు వచ్చి రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేయటం గమనార్హం. బాబుతో మాట్లాడిన మాటలపై మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ ఫెయిల్ కాలేదన్నారు. బడి ఎగ్గొట్టిన వారు.. క్లాస్ లో బ్యాక్ బెంచీల్లో కూర్చున్న వారు ఉన్నత స్థానాలకు ఎదిగినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.
తాను ఎన్నికల్లోపోటీ చేసేందుకు ఇష్టపడతానని.. రాజ్యసకు వెళ్లాలన్న ఆలోచన తనకు లేదన్నారు. రాజ్యసభకు ఎంపిక కావటానికి.. ప్రజల చేత ఎన్నుకోవటానికి చాలా తారతమ్యం చాలా ఉందన్నారు.
ఓపక్క ఢిల్లీలో ఏపీ హక్కుల కోసం మిగిలిన ఎంపీలు పోరాడుతుంటే.. అందుకు భిన్నంగా జేపీ మాత్రం అమరావతి అసెంబ్లీల్లో తిరగటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాబు వేసిన సటైర్ కు.. తనదైన శైలిలో మీడియా ప్రతినిధుల వద్ద పంచ్ వేయటం గమనార్హం.