బాబు.. సైలెంట్‌.. టీడీపీనే ముంచేస్తోందా...?

Update: 2019-12-26 10:04 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబు మౌనం.. ఆ పార్టీకి శాపంగా మారిందా ? ఆయ‌న ఆచితూచి అడుగులు వేస్తున్నాను.. అలానే వేయాలి.. అంటూ చేస్తున్న కాల‌క్షేపం.. మొత్తానికి పార్టీని ఇబ్బందిక‌ర ప‌రిస్థితి వైపు ప‌య‌నించేలా చేస్తోందా ?  దీంతో బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా పార్టీ ఇప్పుడు ప‌ట్టించుకునేవారులేక పురుటి నొప్పులు ప‌డుతోందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇరుకున ప‌డింది. కీల‌క‌మైన జిల్లాల్లోనూ పార్టీ పుంజుకున్న‌ది లేదు. ఉద్దండులు గెలుస్తారు.. ఖాయం అనుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ పూర్తిగా చ‌తికిల ప‌డింది. ఇక‌, పార్టీకి ప‌ట్టుకొమ్మ‌ల వంటి నియోజ‌క‌వర్గాల్లోనూ వైసీపీ పునాదులు ప‌డ్డాయి.

మ‌రి ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా స‌త్వ‌ర‌మే నిర్ణ‌యాలు తీసుకుని పార్టీని ముందుకు న‌డి పించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అయితే, ఆయ‌న ఆదిశ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు తీసుకున్న నిర్ణ‌యాలు కానీ, నాయ‌కుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం కానీ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడు మాసాలు పూర్త‌వుతున్నాయి.  ఈ క్ర‌మంలో జ‌గ‌న్ అటు పార్టీని, ఇటు ప్ర‌భుత్వాన్ని కూడా స‌మ‌ర్ధంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. పార్టీకోసం ప‌నిచేసిన నాయ‌కుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఓడిపోయిన నియోజ‌క‌వ‌ర్గాల పైనా దృష్టి పెట్టారు. ఇక్క‌డ కీల‌క నాయ‌కుల‌ను ఎంక‌రేజ్ చేస్తున్నారు. అయితే, ఈ త‌ర‌హా దూకుడు బాబులో ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గ‌డిచిన ఆరు మాసాల్లోనూ చంద్ర‌బాబు ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టించి రివ్యూలు చేశారు. అదే స‌మ‌యంలో యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తాన‌ని చెప్పారు. అంతేకాదు, 33 శాతం యువ‌త‌కే ప‌ద‌వులు ఇస్తాన‌ని ఘ‌నంగా ప్ర‌క‌టించారు. మ‌రో నెల రోజుల్లో స్తానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్ప‌టికే ఆయ‌న దూకుడుగా బాధ్య‌త‌లు పంచి ఉంటే ప‌రిస్థితి వేరేగా ఉండేది.

కానీ, కీల‌క‌మైన ఓ రెండు జిల్లాల‌కు సంబంధించి రాజ‌ధాని విష‌యాన్ని ప‌ట్టుకుని వేలాడుతున్నార‌నే భావ‌న పార్టీలో బ‌లంగా వినిపిస్తోంది. రాజ‌ధానికి మ‌ద్ద‌తిచ్చేందుకు మిగిలిన జిల్లాల నాయ‌కులు వెనుకాడుతున్న ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు దూర‌దృష్టితో ఆలోచించి.ఇప్ప‌టికైనా కీల‌క‌మైన నాయ‌కుల‌కు ప‌ద‌వులు అప్ప‌గించ‌డం ద్వారా పార్టీని మ‌ళ్లీ గాడిలో పెట్టాల‌ని కోరుతున్నారు.

   

Tags:    

Similar News