ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయాలని తపిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ చిన్న పొరపాటుకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. అవకాశం ఇస్తే.. చివరి క్షణం వరకూ పని చేసే అలవాటున్న అధికారుల వైఖరి గురించి తెలిసిన చంద్రబాబు.. శంకుస్థాపన కార్యక్రమానికి ఐదు రోజుల ముందే డెడ్ లైన్ పెట్టేశారు.
శంకుస్థాపన పనులన్నీ కూడా ఐదు రోజుల ముందే పూర్తి కావాలని.. తాను స్వయంగా తనిఖీ చేస్తానని ఆయన చెప్పారు. పనులు పూర్తి అయితే.. దానికి మెరుగులు దిద్దేందుకు చివరి ఐదు రోజులు శ్రమిస్తే బాగుంటుందన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.
ఇక.. శంకుస్థాపన కార్యక్రమం గురించి చేస్తున్న ఏర్పాట్లు.. నిర్వహిస్తున్న కార్యక్రమాల కారణంగా ప్రజల్లో శంకుస్థాపన కార్యక్రమం పట్ల మరింత ఆసక్తి వ్యక్తమవుతోంది. మొదట అనుకున్నట్లు లక్షమంది వస్తారని అంచనా వేసినా.. తాజా లెక్కల్లో అధికారులు ఈ సంఖ్య మరో యాభైవేలు అదనంగా ఉంటుందని.. మొత్తం 1.5లక్షల మంది ప్రజలు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటివరకూ లక్షమందికి మాత్రమే గ్యాలరీలో సీటింగ్ ఏర్పాటు చేయాలని భావించినా.. మారిన అంచనాలతో మరో యాభై వేల మందికి కూడా గ్యాలరీలో ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. శంకుస్థాపన జరిపే ప్రాంతంలో పనుల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించేందుకు హెలికాఫ్టర్ లో ఏరియల్ సర్వే నిర్వహించిన చంద్రబాబు.. పనుల పట్ల ఎంత శ్రద్ధగా ఉన్నారో తెలియజెప్పే వైఖరి కనిపించింది.
హెలికాఫ్టర్ ను మామూలుగా ప్రయాణించే ఎత్తు కంటే చాలా కిందకు దించి మరీ ఏరియల్ సర్వే నిర్వహించటం గమనార్హం. పార్కింగ్ మొదలు.. ఇతర భద్రతా ఏర్పాట్లు.. అంచెల వారీగా భద్రత ఏర్పాటు చేసే విషయంలో పోలీసులు తలమునకలైపోయారు. ఇక.. శంకుస్థాపన కోసం భారీగా పోలీసు బలగాల్ని.. అధికారులు.. ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. వీరంతా కూడా కార్యక్రమానికి ఐదారు రోజుల ముందే గుంటూరుకు చేరుకొని.. తాము నిర్వహించాల్సిన బాధ్యతల గురించి చెక్ చేసుకొని.. మాక్ డ్రిల్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. శంకుస్థాపనకు సమయం దగ్గర పడుతుండటంతో పనుల్లో వేగం పెరిగింది.