మనిషికి.. మెషీన్ కి ఒక పెద్ద తేడా ఉంది. మనిషికి ఉన్న విచక్షణ మెషీన్ కు ఉండదు. ఒకవేళ.. మెషీన్ కు అలాంటి మేధ వంటపడితే.. ఇక మనిషి అవసరం ఉండదు. అందుకే.. ప్రతిదీ మెకానికల్ గా చేయాలనుకోవటానికి మించిన పెద్ద తప్పు మరొకటి ఉండదు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు చూస్తుంటే.. ఆయన మెకానికల్ గా ఆలోచించటం.. ప్రతిదీ తాను నమ్మిన కొన్ని విధానాల ద్వారానే పూర్తి చేయాలనుకోవటం చూసినప్పుడు ఆందోళన కలగక మానదు.
ఒక విషయంలో సక్సెస్ అయిన ఫార్ములాను ప్రతి విషయానికి అప్లై చేయాలనుకోవటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. పాలన తీరు మీదా.. తన మంత్రులు.. ఎమ్మెల్యేల పని తీరు మీద సర్వేలు చేపట్టిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వాటి ఆధారంగా వారి ప్రతిభను గుర్తించటం.. నివేదికలో పేర్కొన్నట్లుగా వెనుకబడిన వారిని క్లాస్ పీకటం.. వారిలో తప్పుల్ని గుర్తించిన నివేదిక ఆధారంగా వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేయటం.. పాలనలోని లోటుపాట్లను ఎత్తి చూపిస్తున్న సర్వేలకు తగ్గట్లుగా పాలనా విధానాలు మార్పులు చేసుకోవాలనుకోవటం తప్పేం కాదు.
కానీ.. పెళ్లికి.. తద్దినానికి ఒకే మంత్రం ఎంతలా నవ్వుల పాలవుతుందో.. అన్ని అంశాలకు సర్వేలు చేపట్టం.. అభిప్రాయసేకరణలు ఏమాత్రం బాగోవన్న మాటను ముఖ్యమంత్రితో పాటు ఆయన టీం మెంబర్లు కూడా మర్చిపోయినట్లున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో జరిగిన ప్రైవేటు బిల్లు చర్చ.. దానికి ఆర్థికమంత్రి జైట్లీ ఇచ్చిన సమాధానం.. ఈ సందర్భంగా ఏపీ అధికారపక్ష నేతల వ్యవహారశైలి ఇప్పుడు అందరి మదిలో రికార్డు అయిపోయాయి.
రాజ్యసభలో తనవాళ్లు చేసిన తప్పును కవర్ చేసుకునేందుకు ఎన్నిపాట్లు పడాలో అన్ని పాట్లు పడుతున్నారు చంద్రబాబు. ఇందులోభాగంగానే.. ఏపీకి జరిగిన అన్యాయాన్ని గట్టిగా నిలదీయాలని.. అందుకు తగ్గట్లు నిరసన గళాన్ని వినిపించాలని బాబు అండ్ కో భావిస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు కామెడీ మొదలైంది. రాజ్యసభలో తమ పార్టీ నేతల వ్యవహారశైలిపై వెల్లువెత్తుతున్న విమర్శల్ని తగ్గించుకోవటానికి.. జరిగిన తప్పును సరి దిద్దుకోవటానికి వీలుగా ఏం చేయాలన్న అంశంపై సర్వే నిర్వహించాలని భావిస్తున్నట్లుగా ఏపీ అధికారపక్ష నేతలు కొందరు చెప్పటం గమనార్హం.
కేంద్రం మీద ఏ విధంగా పోరాటం చేయాలన్న అంశంపై పార్టీఅభిప్రాయ సేకరణ మొదలెట్టిందని వారు చెబుతున్నారు. ప్రతిదీ సర్వేలు.. అభిప్రాయ సేకరణలు.. నివేదికల సాయంతోనే కార్యాచరణను సిద్ధం చేసుకోవాలనుకోవటానికి మించిన పిచ్చితనం మరొకటి ఉండదు. ప్రతి విషయం మీద ఎవరో ఫీడ్ బ్యాక్ ఇవ్వటం.. దానికి తగ్గట్లు రియాక్ట్ కావాలనుకోవటం చూస్తే.. బాబు అండ్ కో మైండ్ ఉపయోగించటం మానేసి.. మెషీన్ల మాదిరి మారుతున్నట్లుగా ఉందంటూ కొందరు తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.