పవన్ పై బాబు సర్వే చేయిస్తున్నారా?

Update: 2016-11-28 05:30 GMT
నిన్నటి మిత్రుడు రేపటి ప్రత్యర్థి అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న వేళ.. అలెర్ట్ కావటం సహజం. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఇమేజ్ తో లబ్థి పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో 2019 ఎన్నికల్లో జనసేనతో ఢీ కొట్టే పరిస్థితి ఎదురవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మిత్రుడి బలం ఎంతన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఆయన స్వయంగా ఒక టీంను రంగంలోకి దించారని చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న మోడీ మాటకు భిన్నంగా ప్రత్యేక ప్యాకేజీతో ఏపీ సర్కారు సంతృప్తి చెందటంపై పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

విభజన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన హామీకి తగ్గట్లుగా ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరన్న ప్రశ్నను సంధిస్తూ.. సీమాంధ్ర ప్రజల హక్కుల సాధన కోసం తాను 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ బలం ఎంత? ఆయన పట్ల జనంలో ఎలాంటి అభిప్రాయం ఉంది? ఆయన పార్టీ కానీ ఎన్నికల బరిలోకి దిగితే ఎలాంటి స్పందన ఉంటుంది?లాంటి సందేహాల లెక్క తేల్చేందుకు వీలుగా నిఘా వర్గాల్ని బాబు ప్రత్యేకంగా రంగంలోకి దింపినట్లుగా చెబుతున్నారు.

తొమ్మిది ప్రశ్నలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వంద మందిని శాంపిల్ గా తీసుకొని.. వారిచ్చేసమాధానాలపై విశ్లేషణ చేయాలని బాబుభావిస్తున్నట్లుగా సమాచారం. ఈ పనిని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని నిఘా వర్గానికి చెందిన ఒక ఎస్ ఐ నేతృత్వంలో పది మంది కానిస్టేబుల్స్ చేత సర్వే చేయిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షించటం కోసం నిఘా విభాగంలోని అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక.. నిఘా వర్గం చేస్తున్నసర్వేలో పవన్ కు సంబంధించి సంధిస్తున్న తొమ్మిది ప్రశ్నల్ని చూస్తే..

1.        వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే విజయం సాధిస్తుందా?

2.        ఏ పార్టీ మద్దతు తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం సాధించే వీలుంది?

3.        ఏ సామాజిక వర్గం జనసేనకు మద్దతు పలుకుతున్నాయి?

4.        ప్రజా సమస్యల్ని జనసేన పట్టించుకుంటుందా?

5.        పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి అయ్యే సామర్థ్యం ఉందని భావిస్తున్నారా?

6.        వచ్చే ఎన్నికల్లో జనసేన పుంజుకుంటే ఏ పార్టీ నష్టపోయే అవకాశం ఉంది?

7.        2014 ఎన్నికల్లో మీరే ఏ పార్టీకి ఓటు వేశారు?

8.        వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే మీరు ఏపార్టీకి ఓటు వేస్తారు?

9.        బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దించే సామర్థ్యం జనసేనకు ఉందని భావిస్తున్నారా?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News