వాపును బలుపుగా ఫీల్ కావటం మామూలే. ఇలాంటి ధోరణితో వచ్చే ఇబ్బందేమంటే.. వాస్తవానికి దూరంగా వెళ్లేలా చేయటమే కాదు.. అంతకంతకూ కలల్లోకి వెళ్లేలా చేస్తుంది. ఒకలాంటి మత్తు కమ్మిన వేళ.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేయటం కూడా మొదలవుతుంది. తాజాగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు చూస్తే.. ఇదే ముచ్చట చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
లక్ష్యం పెట్టుకోవటంలో తప్పు లేదు కానీ.. మరీ దురాశకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లు టార్గెట్ పెట్టుకోవటంతోనే ఉన్న ఇబ్బందంతా. మరో ఏడాది లోపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోని 175 సీట్లు మొత్తంగా మొత్తం టీడీపీ సొంతం చేసుకోవటం మీదనే దృష్టి పెట్టాలన్న లక్ష్యాన్ని బాబు వెల్లడించారు.
లోక్ సభకు.. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో ఏడాదిలోనే ఎన్నికలు అన్న ఆలోచనతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచి తీరాలని.. ఇకపై అదే లక్ష్యంతో పని చేయాలని.. అందుకు మిషన్ - 175 పేరు పెట్టారు. ఉన్న సీట్లు మొత్తం గెలుచుకోవటం ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. బాబు మాటలు ఎలా ఉన్నాయంటే.. కనీసం విపక్ష నేత సైతం ఎన్నికల్లో గెలవకుండా ఉండాలన్నట్లుగా ఉండటం గమనార్హం.
ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటారు. బాబు తాజా టార్గెట్ చూస్తే.. తాము తప్పించి మరెవరూ గెలవకూడదన్నట్లుగా ఉండటం విశేషం. బాబు టార్గెట్ విని తెలుగు తమ్ముళ్లు సైతం అవాక్కు అవుతున్నారు. అన్ని స్థానాల్లో గెలవాలనుకోవటం తప్పేం కాదు కానీ.. లక్ష్యంలో కాస్తంత ప్రాక్టికాలిటీ ఉండాలన్న కనీస విషయాన్ని బాబు పట్టించుకోకపోవటం ఏమిటని తప్పు పడుతున్నారు.
ఏపీ అధికార పక్షంతో పోలిస్తే.. తెలంగాణ అధికారపక్షం చాలా బలంగా ఉందని చెప్పాలి. నిజానికి తెలంగాణలో కేసీఆర్ స్థాయిలో మరే నేత లేరని చెప్పాలి. ఆయనతో సరితూగే వారు కనుచూపు మేరలో కనిపించని పరిస్థితి. ఇలాంటి చోట కూడా మొత్తం స్థానాలు తామే సొంతం చేసుకోవాలన్న మాట కేసీఆర్ నోట వినిపించదు. అయితే బాబు నోట మాత్రం అందుకు భిన్నంగా అన్నీ స్థానాలు తాము సొంతం చేసుకోవాలన్న బీరాలు పలకటం ఇప్పుడు అవాక్కు అయ్యే పరిస్థితి. కాన్ఫిడెన్స్ మంచిదే కానీ అది స్థాయికి మించి ఒవర్ కాన్ఫిడెన్స్ లోకి వెళితే మొదటికే మోసం వస్తుందన్న మాట వినిపిస్తోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాని లక్ష్యాల్ని విధించుకొని అందరిలోనూ నిరాశను నింపే కన్నా.. ఉత్సాహం ఉరకలెత్తేలా మిషన్ ను సెట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఏదీ వినేటట్టుగా లేరని చెప్పాలి. నంద్యాల..కాకినాడలో తమకు లభించిన విజయం వెనుక అసలు లెక్కల్ని బాబు మిస్ అవుతున్నట్లుగా కనిపించకమానదు. వాస్తవాల్ని చూడకుండా ఊహల్లో తేలుతున్న బాబు.. అందుకు తగ్గట్లే సెట్ చేసిన మిషన్ ముంచేదే తప్ప తేలేది కాదన్న భావన పలువురిలో వ్యక్తమవుతోంది.