పవన్ ని సైడ్ ట్రాక్ చేయాలి.. చంద్రబాబు ప్లాన్ అదిరిందిగా?

Update: 2020-08-20 17:38 GMT
టీడీపీ అధినేత బలం సరిపోవడం లేదు. చంద్రబాబు సొంతంగా ఎన్నికల్లో పోటీచేసి గెలిచి చాలాకాలం అయ్యింది.   2014లో బీజేపీ, జనసేన వల్ల బాబు గట్టెక్కాడు. అందుకే బీజేపీ ఎలాగూ కలిసే అవకాశాలు లేవు... జనసేనను అయినా తమతో కలుపుకోవాలని చంద్రబాబు వ్యూహాలు రూపొందిస్తున్నట్టు టీడీపీలో ప్రచారం సాగుతోంది.

2014లో టీడీపీ అధినేత చంద్రబాబు గెలుపుకు.. 2019లో ఆయన ఇంత చిత్తుగా ఓడిపోవడానికి కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ అని నాడు అనలిస్టులు.. మీడియా కోడైకూసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఓట్ల చీలిక కారణంగా దాదాపు 40 అసెంబ్లీ సీట్లలో ప్రభావం చూపి టీడీపీ చిత్తుగా ఓడిపోయిందని విశ్లేషకులు ఆనాడు చెప్పుకొచ్చారు. కృష్ణా గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు 40 సీట్లలో 20 వేల నుంచి 40 వేల వరకు టీడీపీ ఓట్లు జనసేన వలన చీలి పోయాయని..  ఈ సారి అలా జరగకూడదని చంద్రబాబు ఆధ్వర్యంలో తాజాగా ప్లాన్ చేశాడట..
 
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నుంచి బీజేపీని దూరం చేయాలనే ఎత్తుగడను టీడీపీ బ్యాచ్ వేసిందని సమాచారం. ఇందుకోసం వైసీపీతో బీజేపీ కలిసిపోయిందని.. టీడీపీ అనుకూల చానెల్స్ , మీడియా, సోషల్ మీడియాల్లో గట్టిగా ప్రచారం చేసి అదరగొడితే పవన్ కళ్యాణ్ ఇరిటేట్ అయ్యి సైడ్ జరిగిపోతాడని చంద్రబాబు ప్లాన్లు వేస్తున్నాడట.. అప్పుడు బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్ ను ఒంటరిని చేస్తే.. జనసేన ఎలాగూ ఆర్థికంగా అంత బలంగా లేకపోవడంతో తప్పనిసరిగా టీడీపీకి దగ్గర అవుతుందని టీడీపీ అధినేత స్కెచ్చులు గీస్తున్నాడట..
 
డైరెక్టుగా పవన్ కళ్యాణ్ తో పనికాదు కాబట్టి.. అందులోనూ సొంతంగా పవన్ కళ్యాణ్ గెలిచే చాన్స్ లేదు కాబట్టి ఇన్ డైరెక్టుగా పవన్ ని టీడీపీకి దగ్గర చేసుకోవాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ చేశాడని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
 

    

Tags:    

Similar News