చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. గత ఎన్నికల్లో చంద్రబాబుతో సహా మొత్తం ఆరుగురు జిల్లాలో టీడీపీ నుంచి విజయం సాధించారు. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి సైకిలెక్కి మంత్రి అయ్యారు. దీంతో మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలయ్యారు. చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తారా..? లేక తిరుపతి నుంచి బరిలోకి దిగుతారా..? అన్న చర్చ జిల్లాలో మొదలైంది. పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయట.. కుప్పంను లోకేష్ బాబుకు ఇచ్చేసి ఆయన వేరే నియోజకవర్గం చూసుకుంటున్నారన్న వార్త హల్ చల్ చేస్తోంది. మొత్తానికి బాబు చిత్తూరు జిల్లాలో ఏదో ఒక నియోజవర్గం నుంచి మాత్రం పోటీలో ఉంటారని అంటున్నారు. ఇక అమర్ నాథ్ రెడ్డి కూడా మరోసారి పలమనేరు నుంచి పోటీకి సిద్ధమవుతున్నాడు. వీళ్లిద్దరిది పక్కన పెడితె మిగతా సీట్లపై టీడీపీ టికెట్ల విషయంలో ఎలాంటి స్పష్టత రావడం లేదట. దీంతో సీఎం సొంత జిల్లాలో టీడీపీ నేతలకు కొత్త టెన్షన్ ప్రారంభమైంది.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ లేదని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు. అయితే ఆయన కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వబోతున్నట్లు చర్చ జరుగుతోంది. చిత్తూరు ఎమ్మెల్యే డికె సత్యప్రభకు టికెట్ ఇస్తారని పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రావడం లేదు. దీంతో ఆమె చిత్తూరు కేంద్రంగా ఎలాంటి హడావుడి కనిపించడం లేదట. మరోవైపు ఆయన కుమారుడు డీఎ శ్రీనివాస్ ను రాజంపేట ఎంపీగా బరిలోకి దింపాలన్న ఆలోచనలో బాబు ఉన్నారు. 2009లో పీఆర్ పీ నుంచి రాజంపేట ఎంపీగా పోటీ చేసి శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. శ్రీనివాస్ కు టికెట్ ఇస్తే సత్యప్రభకు టికెట్ లేనట్లేనని పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
మరోవైపు తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ కేంద్రంగా పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోందట. సుగుణమ్మకు పోటీగా టికెట్ దక్కించుకునే లీడర్ లేడన్నది క్యాడర్ మాట. ఈ కోణంలో చూస్తే ఆమెకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఖాయం కావాలి. అయితే ఇక్కడే చిన్న మెలిక ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఎందుకంటే సీఎం చంద్రబాబు ఈసారి కుప్పం నుంచి కాకుండా తిరుపతి నుంచి పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారట. ఒకవేళ చంద్రబాబు తిరుపతి నుంచి పోటీకి సై అంటే సుగుణమ్మకు టికెట్ లేనట్లేనని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇక తమ్మళ్లపల్లి ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కు ఈసారి టికెట్ డౌటే అంటున్నారు. పార్టీ నిర్వహించిన సర్వేలో ఆయనకు నెగెటివ్ మార్కులు పడడమే అందుకు కారణమంటున్నారు. తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో పార్టీ శ్రేణుల్లోనూ అసంతృప్తి నెలకొందట. ఇలా ఒక్కొక్క ఎమ్మెల్యేలలో ఒక్కో సమస్య ఉండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చంద్రబాబు ఎంతమందికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడోనన్న చర్చ జరగుతోంది. అయితే లోకేష్ బాబు కోసం చంద్రబాబు తన సీటునే త్యాగం చేసి తిరుపతికి మారబోతున్నడన్న వార్తలు మాత్రం రాజకీయాలను షేక్ చేస్తున్నాయి.