అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన తర్వాత 2014లో తాను ఇచ్చిన కీలక హామీపై తెలుగుదేశం పార్టీ అధినేత - ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యచరణ మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో అనేకమంది యువతను ఆకట్టుకున్న నిరుద్యోగ భృతిని అందించేందుకు కార్యాచరణ చేస్తున్నట్లు బాబు వెల్లడించారు. అంతర్జాతీయ ఎంఎస్ ఎంఇడే సందర్బంగా ఏర్పాటైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో నిరుద్యోగ భృతిపై విధాన పరమైన ప్రకటన చేస్తామని వెల్లడించారు. తాము గతంలో ఇచ్చిన హామీ మేరకు కట్టుబడి ఉన్నామని, నిరుద్యోగులకు ఊరటనిచ్చే చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం వెనుకాడేది లేదని స్పష్టం చేశారు.
ప్రపంచ నాలెడ్జిని ఆంధ్రప్రదేశ్ ముంగిటకు తీసుకువస్తున్న క్రమంలో నిరుద్యోగ యువత క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని చంద్రబాబునాయుడు నొక్కి చెప్పారు. డిగ్రీ చదివిన విద్యార్దులకు - యువతకు ఏ విధంగా నిరుద్యోగ భృతి ఇవ్వాలనే ప్రక్రియపై కసరత్తు చేస్తున్నామని అన్నారు. వారి సేవలను ఏ విధంగా వినియోగించుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందో ఆలోచిస్తున్నామని, విధి విధానాలు ఖరారు చేసే ప్రక్రియ చురుకుగా సాగుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత పాత్రకూడా కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నిరుద్యోగ భృతిపై అర్హతలకు సంబంధించి కూడా విదివిధానాలపై కసరత్తు సాగుతుందని అన్నారు. అనంతరం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాధ్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేయటంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రికి వివరించారు. సమస్యలను విన్న మంత్రి వీలైనంత త్వరగా అన్ని ఇబ్బందులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ - ఎస్టీలు వాహనాలు కొనేందుకు ప్రస్తుతం ఉన్న రూ. 17 లక్షల పరిమితిని రూ. 20 లక్షలకు పెంచుతున్నామని మంత్రి తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చేవారికి రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లతో మాట్లాడుతామని అమరనాధరెడ్డి పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/