ఎగ్జిట్ పోల్స్ విషయంలో చంద్రబాబు నాయుడు తన పార్టీ వాళ్లతో చేసిన వ్యాఖ్య తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ను మరింత కిందకు నెట్టింది. 'ఎగ్జిట్ పోల్స్ కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందనే చెబుతాయి.. భయపడకండి..' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ వాళ్లతో వ్యాఖ్యానించారట. ఆ మాటలు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు స్థైర్యాన్ని ఇవ్వడం మాటేమిటో కానీ - ఆ పార్టీ విజయావకాశాల మీద ఆశలు పెట్టుకున్న వాళ్లను చంద్రబాబు నాయుడి మాటలే మరింత డల్ అయిపోయేలా చేస్తూ ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ఇలా పార్టీ పరాజయాన్ని చంద్రబాబు నాయుడే ఖరారు చేశారనే టాక్ మొదలైంది. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్ గా నిలుస్తూ ఉంది. మరి ఇలాంటి క్రమంలో చంద్రబాబు నాయుడు మరో రకంగా వార్తల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ పరాజయం దాదాపు ఖరారు అయ్యిందనే విశ్లేషణల మధ్యన చంద్రబాబు నాయుడు 'ఈనాడు' అధిపతి రామోజీ రావును కలుస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
రామోజీ రావుకు చంద్రబాబుకు ఉన్న అనుబంధం ఏమిటో ఎవరికీ వివరించనక్కర్లేదు. అది ఎవరికైనా తెలియకపోతే..ఇంత క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వెళ్లి రామోజీతో సమావేశం అవుతున్నారంటే వాళ్లిద్దరి బంధాన్నీ అర్థం చేసుకోవచ్చు!
ఇవతల ఏపీలో అధికారం చేజారేలా ఉంది. అటు వైపు ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడి చక్రం తిరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ఇప్పటికే కాంగ్రెస్ తో చాలా ముందుకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ కేమో సొంతంగా కాదు కదా..ఈ ట్రూపునంతా వెంట వేసుకుని అధికారాన్ని సంపాదించుకునే శక్తి కూడా కనిపించడం లేదు. కాంగ్రెస్ కు బీజేపీ వాళ్లు అంత అవకాశాన్ని ఇచ్చేలా లేరు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ - సింగిల్ లార్జెస్ట్ కూటమిగా ఎన్డీయే నిలిచే అవకాశం ఉంది.
చంద్రబాబు నాయుడు ఇప్పుడు టక్కున ఎన్డీయే వైపు దూకేయగల ఘనుడే. అయితే ఈయనకు ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయనేదాన్ని బట్టే అక్కడ విలువ దక్కే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో మొత్తంగా చంద్రబాబు నాయుడు కార్నర్ లో కనిపిస్తూ ఉన్నారు.
ఎంపీ సీట్లు తగిన స్థాయిలో రాకపోతే - ఏపీలో అధికారం చేజారితే చంద్రబాబు నాయుడు ఎదుర్కొనాల్సిన పరిణామాలు ఎన్నో ఉన్నాయి! అవేమిటో ఫలితాలు వచ్చాకా అర్థం అవుతుంది అందరికీ. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి చంద్రబాబు నాయుడు తన రాజగురువును కలుస్తున్నారు. ఈ సమావేశంలో వీరు పరస్పరం ధైర్యం చెప్పుకుంటారా? లేక పరిస్థితులు విపత్కరంగా మారిన వేళ కొత్త వ్యూహాలను పన్ని ముందుకు వెళ్లేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
అయితే ఎవరు ఏ వ్యూహాలను పన్నినా - ఏ ప్లాన్ లను అమలు చేయాలన్నా.. కనీస స్థాయిలో ఎంపీ సీట్లు - ఎమ్మెల్యే సీట్లు రాకపోతే ఎవరూ ఏం చేయలేరనేది మాత్రం విశ్లేషకులు స్పష్టం చేస్తున్న విషయం. ఇప్పుడు ప్లాన్లు - వ్యూహాలతో కాదు అని.. సాధించే సీట్లతోనే ఎవరేమిటీ అనేది తేలుతుందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.