అమెరికాలో చంద్రబాబు నాయుడు వెళ్లింది అక్కడికే?

Update: 2019-07-31 14:30 GMT
ఒకవైపు శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నా చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్లిపోయారు. ప్రతిపక్షం సభకు హాజరు కావడం గురించి గతంలో చంద్రబాబు నాయడు చాలా మాటలే మాట్లాడారు. అయితే తన వరకూ వచ్చేసరికి అమెరికా పర్యటనను చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు కూడా వాయిదా వేసుకోలేకపోయారు. అసెంబ్లీకి వెళ్లడంపై చంద్రబాబుకు ఎంత మాత్రం ఆసక్తి ఉందో అర్థం చేసుకోవడానికి ఈ పరిణామాలు చాలని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

ఆ సంగతలా ఉంటే..అమెరికా వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ ఎక్కడకు వెళ్లారు? అనే అంశంపైనా చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అమెరికాకు వెళ్లారని - ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయన చికిత్స కోసం యూఎస్ వెళ్లారని టీడీపీ అధికారికంగా ప్రకటించింది.

అయితే  చంద్రబాబు ఆరోగ్యానికి ఏమైంది? అమెరికాలో ఆయన ఎక్కడకు వెళ్లారు? అనే అంశాలపై మాత్రం స్పష్టతను ఇవ్వలేదు తెలుగుదేశం. ఈ అంశంపై ఆ పార్టీ అధికారికంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఇంతకీ చంద్రబాబు  యూఎస్ లో ఎక్కడకు వెళ్లారు? అంటే.. షికాగో అని తెలుస్తోంది. అక్కడ ఒక ప్రముఖ వైద్యుడి దగ్గర చంద్రబాబు చికిత్స తీసుకోనున్నారట.

అమెరికాలో చంద్రబాబు నాయుడుకు సన్నిహితులు అయిన వారు ఇచ్చిన సలహా మేరకు ఆయన ఆ వైద్యుడి దగ్గరకు వెళ్లారని తెలుస్తోంది. ఆ వైద్యుడు ఒక న్యూరాలజిస్ట్ అని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు బ్యాక్ పెయిన్ తో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారట. ఈ నేపథ్యంలో అన్ని రకాల చికిత్సల కోసం యూఎస్ వెళ్లారని సమాచారం.

Tags:    

Similar News