బాబు మార్క్ రాజ‌కీయం..స‌ర్కారు సొమ్ముతో పార్టీకి ప్ర‌చారం

Update: 2019-02-02 16:45 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఓట్ల రాజ‌కీయం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు అనేం అనేకానేక ఉదాహ‌ర‌ణ‌ల్లో...తాజా తార్కాణం ఇది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వ సొమ్మును ఖర్చు చేసి ప‌థ‌కం ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా...దాన్ని సొంత పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం ఉప‌యోగించుకోవ‌డం చంద్ర‌బాబుకే చెల్లిందంటున్నారు. ఇదేదో బాబు పరోక్షంగా చేయ‌లేదు...ప్ర‌త్య‌క్షంగానే ల‌బ్ధి పొందిన వారికి ఆర్డ‌ర్ వేసేశారు. ఇదంతా, ఏపీలో ఆటో డ్రైవర్ల‌కు జీవితకాల పన్ను రద్దు చేసిన ఎపిసోడ్ గురించి.

ఏపీ ప్ర‌భుత్వం తాజాగా ఆటోలపై లైఫ్‌ టాక్స్  ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అమరావతిలో ఆటోలపై లైఫ్ టాక్స్ రద్దు చేసినందుకు పెద్దసంఖ్యలో ఆటోడ్రైవర్లు చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఈ క్ర‌మంలో ఆటోడ్రైవర్‌ చొక్కా ధరించి తన నివాస ప్రాంగణంలో స్వయంగా ఆటో నడిపి అందరిలోనూ హుషారు నింపారు. అనంత‌రం చంద్రబాబు మాట్లాడుతూ - ఆటో డ్రైవర్లకు వరాలు కురిపించారు. ఇంధన చార్జీలు - ఇన్సూరెన్స్ చార్జీలు తగ్గేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. ప్రయాణికుల క్షేమం మీరు చూసుకోండి.. మీ క్షేమం నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ ఆటోలు తెచ్చి ఇబ్బందులు లేకుండా చేస్తానని అన్నారు. రూ.40 కోట్లు భారమని అని తెలిసినా.. ఆటోలపై లైఫ్ ట్యాక్స్ రద్దు చేశానని స్పష్టం చేశారు.

తన జీవితానికి ఆటో డ్రైవర్ల జీవితానికి ఎన్నో దగ్గర పోలికలు ఉన్నాయని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని డ్రైవర్లు పోషిస్తుంటే రాష్ట్రాన్ని నడుపుతూ ప్రజల సంక్షేమాన్ని తాను చూస్తున్నానని చంద్రబాబు తెలిపారు.  ఈ నిర్ణ‌యం కారణంగా మేలు జ‌రిగిన ఆటో డ్రైవ‌ర్లు ప్ర‌తీ ఆటోకి టీడీపీ జెండా క‌ట్టాల‌ని..ఆటో వెనుక థాంక్యూ సీయం సార్ పేరుతో బోర్డులు పెట్టాల‌ని బాబు ఆర్డ‌ర్ వేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి అండ‌గా నిలవాల‌ని ఆకాంక్షించారు. రానున్న 75 రోజుల పాటు సైనికుల్లాగా త‌న గెలుపు కోసం ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు. ఇది స్థూలంగా, బాబు గారి స‌ర్కారి సొమ్మును సొంతానికి వాడుకున్న అంశంలోని లెక్క‌.
Tags:    

Similar News