విభజన నేపథ్యంలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు నిధుల కొరత.. మరోవైపు అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులతో పాటు.. విదేశీ పెట్టుబడులు ఆకర్షించటం పెద్ద తలనొప్పిగా మారింది. విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు తరచూ సీఎం చంద్రబాబు ఫారిన్ టూర్లకు వెళ్లాల్సిన వస్తోంది. ఇంక ఎప్పటికి ఇదేనా? అన్న ప్రశ్న పలువురు నోట వినిపించే పరిస్థితి. ఎప్పుడూ ఇలా టూర్లమీద టూర్లకు వెళ్లటం.. భారీగా ఖర్చులు చేయటం తప్ప.. దాని వల్ల కలుగుతున్న ప్రయోజనం తక్కువగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి విమర్శల్ని లైట్ తీసుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. పెట్టుబడుల కోసం తరచూ విదేశాలకు వెళ్లే కన్నా.. ఆయా దేశాల్లో అమరావతి ఆఫీసులు ఓపెన్ చేయటం ద్వారా.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకునే కంపెనీలను ఆకర్షించే వీలు కలుగుతుందన్న ఆలోచన చేశారు.
ఇందులో భాగంగా లండన్ లో అమరావతి ఆఫీసు ఓపెన్ చేసిన ఏపీ సర్కారు.. త్వరలో సింగపూర్.. జపాన్ రాజధాని టోక్యో.. హాంకాంగ్ లేదంటే షాంగై.. ప్యారిస్.. దుబాయ్.. అమెరికాలోని లాస్ ఏంజెలిస్ నగరాల్లో అమరావతి ఆఫీసుల్ని తెరవాలని భావిస్తున్నారు. ఈ కార్యాలయాల ద్వారా.. ఆయా దేశాల్లోని పలు కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా వ్యవహరించి ఉన్నాయి. తాజా నిర్ణయాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. నిజానికి ఇలాంటి నిర్ణయం చంద్రబాబు మొదటే చేసి ఉంటే ఖర్చు తగ్గటంతో పాటు.. బాబుకు కొంత శ్రమ అయినా తగ్గి ఉండేది.