బాబు.. మీ గొప్పలు మామూలుగా లేవుగా?

Update: 2019-11-12 12:37 GMT
తాను చెప్పే మాటలు ఎంత ఎటకారంగా మారినా.. తన తీరును మార్చుకోవటంలో ఏపీ విపక్ష నేత చంద్రబాబు ముందుంటారు. వెనుకా ముందు చూసుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడేయటంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇప్పటికే తన మాటలకు మీడియాలోనూ.. సోషల్ మీడియాలో భారీగా ఎటకారం చేసుకుంటున్నప్పటికీ ఆయన మాత్రం తన తీరును మార్చుకోవటం లేదనే చెప్పాలి.

ఏపీలో ఇసుక కొరతకు కారణం తెలిసినా.. యాగీ చేస్తూ.. ప్రజల్ని పక్కదారి పట్టించే చంద్రబాబు.. తాజాగా ఇసుక విషయంలో తాను చేసిన హెచ్చరికకు ఏపీ ప్రభుత్వం కదిలిపోయినట్లుగా ఆయన చెబుతున్న మాటలు కామెడీ కోటల్ని దాటేస్తున్నాయి. అనుకోని రీతిలో వర్షం ఎక్కువగా పడటం.. వరద పోటు ఎక్కువగా ఉండటం.. ఇది కాస్త ఎక్కువ రోజులు సాగటంతో ఇసుక కొరత తీవ్రమైంది.

వరద కారణంగా పెరిగిన ఇసుక కొరతపై వాస్తవాలు తెలిసినా.. పొలిటికల్ మైలేజీ కోసం బాబు అండ్ కో చెప్పిన అబద్ధాలు అన్ని ఇన్ని కావు. ఇదిలా ఉంటే.. వరద పోటు తగ్గిన కారణంగా ఇసుక కొరత తగ్గుతూ.. ఉత్పత్తి పెరుగుతోంది. వాస్తవానికి పది రోజుల క్రితం నుంచి ఇసుక ఉత్పత్తి పెరగటమ కాదు.. వరద పోటు తగ్గటంతో నెల రోజుల వ్యవధిలో ఇసుక సమస్య సాధారణ స్థాయికి తగ్గిపోతుందన్న మాటను జగన్ ప్రభుత్వం చెబుతోంది.

అయినప్పటికీ ఈ విషయాల్ని పట్టించుకోని చంద్రబాబు ఈ నెల 14న విజయవాడలో ఇసుక కొరత మీద 12 గంటల పాటు దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ఇసుక కొరత తగ్గిపోతూ..మరికొద్ది రోజుల్లో యథాతధ స్థితికి చేరుకుంటుందన్న వేళలో బాబు దీక్ష డేట్ ను ప్రకటించటంపై పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి వేళ.. మరింత కామెడీగా ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. తాను దీక్ష డేట్ అనౌన్స్ చేసిన వెంటనే ఇసుక అందుబాటును స్వల్పంగా పెంచినట్లు చెప్పారు.

అంతేకాదు.. తన దీక్షను దెబ్బ తీసేందుకే తాను ప్రకటించిన డేట్ రోజునే ఇసుక వారోత్సవాల ప్రకటనను చేశారన్నారు. ఇసుక కొరత అన్నది ఏపీ చరిత్రలో లేదని అని చెబుతున్న చంద్రబాబు తన హయాంలో ఇసుక దోపిడీని మర్చిపోతున్నారని మండిపడుతున్నారు. వరద పోటు తగ్గిన వెంటనే పెద్ద ఎత్తున ఇసుకను వెలికితీస్తామని ప్రభుత్వం అదే పనిగా చెబుతున్నా.. ఈ నెల 14న దీక్షను బాబు ప్రకటించిన విషయాన్ని మర్చిపోకూడదు. చూస్తుంటే.. తాను దీక్ష చేయటం కారణంగానే ఇసుక కొరత తగ్గిందన్న మాటను చెప్పేట్లుగా ఉందని చెప్పక తప్పదు. నాటకాలతో నిజాల్ని కప్పిపుచ్చాలన్న ప్రయత్నాలకు ఎన్నికల్లో సరైన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా బాబు తీరులో మార్పు రాకపోవటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News