చంద్ర‌బాబు డ‌బుల్ ప్లాన్‌.. త‌మ్ముళ్లు క‌ద‌లాల్సిందే..!

Update: 2022-10-14 05:54 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ద్విముఖ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. దీనిని అమ‌లు చేయ‌డం ద్వా రా.. ఒక‌వైపు.. వైసీపీకి చెక్ పెట్ట‌డంతోపాటు.. మ‌రోవైపు.. పార్టీ నేత‌ల‌ను క‌ద‌లించేందుకు కూడా.. ఆయ‌న ప్లాన్ చేసుకున్నారు. ఇప్ప‌టి వర‌కు.. స్త‌బ్దుగా ఉన్న ఉత్త‌రాంధ్ర జిల్లాల టీడీపీ రాజ‌కీయాల‌ను ప్ర‌క్షాళ‌న చేసే క్ర‌మంలో చంద్ర‌బాబు వ‌డివ‌డిగా అడుగులు వేయ‌డం ప్రారంభించారు. ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ప్ర‌స్తు తం.. ఒక విధ‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంది.

అధికార పార్టీవైసీపీ దూకుడు పెంచింది. మూడు రాజ‌ధానుల విష‌యంలో ప్ర‌జ‌ల‌ను ఒప్పించేందుకు.. వారి పై ఒత్తిడి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో టీడీపీ నాయ‌కులు ముందుకు వ‌చ్చి.. త‌మ వాద‌న వినిపించాలి. లేదా.. అమ‌రావ‌తి రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాలి. ఇదేస‌మ‌యంలో టీడీపీ లేవ‌నెత్తిన‌ట్టు.. విశాఖ‌లో భూదందాలు.. క‌బ్జాలు చేస్తున్నార‌ని.. వైసీపీ నేత‌ల‌పై పోరాటం చేస్తున్న వారు కూడా క‌నిపించడం లేదు.

బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి, అచ్చ‌న్నాయుడు.. స‌హా ఇత‌ర‌త్రా నేత‌లు.. మాత్ర‌మే.. కొంద‌రు మాట్లా డుతున్నారు. మిగిలిన‌వారు.. స్పందించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో టీడీపీ వాయిస్ అనుకున్న రేంజ్‌లో వినిపించ‌డం లేద‌నే వాద‌న ఉంది.

మ‌రోవైపు.. వైసీపీ విష‌యంలో మంత్రులు, సీనియ‌ర్ నాయ‌కులు.. ఎక్క‌డెక్క‌డ నుంచో వ‌స్తున్న నాయ‌కులు కూడా.. విశాఖ‌ను రాజ‌ధాని చేస్తున్నామ‌ని.. చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో టీడీపీ నుంచి కౌంట‌ర్లు ప‌డ‌డం లేదు.

దీనిని గ‌మ‌నించిన చంద్ర‌బాబు.. విశాఖ‌లోనే మ‌కాం వేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈనెల 19 త‌ర్వా త‌.. ఆయ‌న విశాఖ‌లోనే ఉండి.. వైసీపీ రాజ‌కీయాల‌కు ఆయ‌న కౌంట‌ర్ ఇవ్వాల‌ని భావిస్తున్నారు. అదేస మయంలో.. అమ‌రావ‌తి రాజ‌ధానికి వ్య‌తిరేకంగా.. సాగుతున్న ఉద్య‌మానికి కూడా.. ఆయ‌న చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఇక‌,  పార్టీప‌రంగా.. స్త‌బ్దుగా ఉన్న నాయ‌కుల‌ను కూడా హెచ్చ‌రించాల‌ని.. మండ‌లా ల వారిగా.. స‌మావేశాలు పెట్టి.. పార్టీని, నేత‌ల‌ను కూడా గాడిలో పెట్టాల‌ని.. చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న ట్టు తెలుస్తోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News