ఎంత చేస్తున్నా.. బాబు మార్కు పోవ‌ట్లేద‌బ్బా.. వైసీపీలో గుస‌గుస‌..!

Update: 2022-10-11 07:30 GMT
అధికారంలో ఏ పార్టీ ఉన్న‌ప్ప‌టికీ.. అప్ప‌టి వ‌ర‌కు.. పాల‌న సాగించిన పార్టీ తాలూకు గురుతుల‌ను చెరి పేయాల‌నే వ్యూహాన్ని అమ‌లు చేయ‌డం స‌హ‌జం. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దేశంలో అదే జ‌రిగింది. చాలా వ‌ర‌కు రాష్ట్రాల్లో అప్ప‌టి వ‌ర‌కు అనుస‌రించిన పాల‌న‌ను తుడిపేసి.. త‌మ‌కంటూ.. ప్ర‌త్యేక పాల‌న ఏర్పాటు చేసు కోవడం స‌హజం. అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రాల వ‌ర‌కు కూడా.. నాయ‌కులు.. పార్టీలు.. అధికారంలో కి వ‌చ్చిన త‌ర్వాత‌.. చేస్తున్న ప‌నులు ఇవే.

దీనిని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. ఏ నాయ‌కుడు.. ఏ పార్టీ కూడా.. ఈ సూత్రా నికి అతీతంగా అయితే.. వ్య‌వ‌హ‌రించ‌లేదు. పాల‌న ఎవ‌రు సాగించినా..త‌మ పంథాలోనే ముందుకు సాగారు.

ఇప్పుడు ఏపీలోనూ ఇదే త‌ర‌హా పాల‌న సాగుతోంది. గ‌తంలో చంద్ర‌బాబు ప్రారంభించిన ప‌థ‌కాలు.. కార్య‌క్ర‌మాల స్థానంలో వైసీపీ నూత‌న ప‌థ‌కాలు.. కార్య‌క్ర‌మాలు తీసుకువ‌చ్చి..ఆయ‌న పేరు లేకుండా చేయాల‌నే వ్యూహాన్ని అమ‌లు చేస్తోంది.  

రాజ‌కీయంగా ఎలాంటి..  ప‌క్ష‌పాతం లేకుండా చూస్తే.. దీనిని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. గ‌తంలో చంద్ర‌బాబు కూడా ఇదే చేశారు. కొన్ని కొన్ని ప‌థ‌కాల‌కు అప్ప‌టి వ‌ర‌కు ఉన్న పేరు తీసేసి.. ఎన్టీఆర్ పేరు పెట్టారు.రాజీవ్ ఆరోగ్య శ్రీని.. ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీగా మార్చారు. సో.. అంతా ఆ తాను ముక్క‌లే. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. అన్న క్యాంటీన్లు తీసేశారు. అదేవిధంగా రాజ‌ధాని అమ‌రావ‌తిని ఆపేశారు. రంజాన్ తోఫా.. చంద్ర‌న్న కానుక‌ల‌ను కూడా తీసేశారు.

అంటే..వ్యూహాత్మ‌కంగా.. చంద్ర‌బాబు పేరును ప‌క్కన పెట్టార‌నే చెప్పాలి. అయితే.. అనుకున్న విధంగా చంద్ర‌బాబు పేరు మాత్రం వైసీపీ నాయ‌కులు తుడిచేయ‌లేక‌పోతున్నారు. కొన్ని కొన్ని విష‌యాల్లో ఇప్ప‌టి కీ.. వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి పేరును ఎలా అయితే.. ప్ర‌జ‌లు గుర్తు పెట్టుకున్నారో.. పింఛ‌న్ల‌ను రూ.2000 చేయ‌డం.. అన్న క్యాంటీన్ల‌ను ఓపెన్ చేసి.. ప్ర‌జ‌ల‌కు రూ.5కే ఆహారం అందించ‌డం.. విదేశీ విద్యాకానుక వంటి కీల‌క ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం.. వంటివి చంద్ర‌బాబును ప్ర‌జ‌ల‌కు దూరం చేయ‌లేక‌పోతు న్నాయి.

ప్ర‌స్తుతం గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న‌ ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేల‌కు.. ప్ర‌జ‌ల నుంచి ఇదే మాట వినిపిస్తోంది. చంద్ర‌బాబు హ‌యాంలోనూ..  ఇవి అమ‌ల‌య్యాయ‌ని.. మీరే తీసేశార‌ని.. ప‌లు చోట్ల ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. దీంతో ఈ ప‌రిణామాల‌పై వైసీపీ నాయ‌కులు .. త‌ల ప‌ట్టుకుంటున్నా రు. ప‌థ‌కాల‌ను తీసేసినా.. ప్ర‌జ‌ల నుంచి చంద్ర‌బాబును వేరే చేయ‌లేక పోయామే అని నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News