రాయలసీమ నిర్మాణమే జరగలేదు.. పునర్మిర్మాణమా చంద్రబాబు?

Update: 2020-08-30 16:30 GMT
అవసరార్థం వాడుకొని వదిలేయడంలో చంద్రబాబును మించిన రాజకీయ చాణక్యుడు లేడని ఆయన ప్రత్యర్థులు ఆడిపోసుకుంటారు.. మొన్నటి ఎన్నికల సీట్ల కేటాయింపులో ఇది స్పష్టమైంది కూడా.. వైసీపీ నుంచి టీడీపీలో చేర్చుకున్న కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలకు చివర్లో సీట్లు నిరాకరించిన వైనం విస్తుగొలిపింది. సీట్లు దక్కని వారు బాబు మోసాన్ని తలుచుకొని బోరుమని ఏడ్చేశారు. నిండా మునిగాక మళ్లీ పాత జగన్ వద్దకు వచ్చి చేరారు. ఇలా వాడుకొని వదిలేయడంలో బాబు తర్వాతే ఎవరైనా.. కానీ అది ప్రత్యర్థులు ఫోకస్ చేయకపోవడంతో ప్రతిసారి తప్పించుకుంటున్నారు.

దేశంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు వాడినట్టుగా నేతలను ఎవరూ వాడలేరనే టాక్ ఉంది. అవసరార్థం రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించిన కళాపోషకుడు లేడని ఆయన ప్రత్యర్థులు సెటైర్లు వేస్తుంటారు. చంద్రబాబు ఏ నేతలు అయినా రాజకీయంగా వాడుకొని వదిలేస్తుంటాడని అంటుంటారు. తెలంగాణలో మోత్కుపల్లి నుంచి రేవంత్ రెడ్డి వరకు.. ఏపీలో పరిటాల నుంచి సబ్బం హరి వరకు యూజ్ అండ్ త్రో పాలసీలో బాబును మించిన ఘనుడు లేడంటారు.

తాజాగా చంద్రబాబు.. దివంగత టీడీపీ నాయకుడు పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు. ‘పీడిత ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను ప్రసాదించి పేదల పక్షాన నిలిచిన వ్యక్తి పరిటాల రవీంధ్ర అని చంద్రబాబు కొనియాడు. ‘తెలుగుదేశం నేతగా రాయలసీమ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన పరిటాల రవి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు’ అని చంద్రబాబు అన్నారు.

తెలుగుదేశంలో పరిటాల రవీంద్ర చేరిందే 1993లో.. పెనుగొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాంటి పరిటాల ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను ప్రసాదించాడని చంద్రబాబు అన్నాడు. దీనిపై కొందరు సెటైర్లు వేస్తున్నారు. మనకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు వచ్చింది.. 1947 ఆగస్టు 15న అని.. బ్రిటీషర్లే మనకు స్వేచ్ఛనిచ్చారని.. అది మరిచి రాయలసీమ వారికి పరిటాల రవీంద్ర ఇచ్చాడని చంద్రబాబు అనడం ఏంటని ఎద్దేవా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు.

రాయలసీమ నిర్మాణమే జరగలేదు.. పునర్మిర్మాణం ఎప్పుడు జరిగింది చంద్రబాబు గారు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పరిటాల చనిపోయాడు కాబట్టి కొన్ని మంచి మాటలు చెప్పాలి కానీ.. పరిటాల మీద రాయలసీమ మీద ఇలాంటి అబద్దాలు చెబితే పరిటాల ఆత్మ సంతోషించదు అని రాయలసీమ టీడీపీ వాళ్లే అనుకుంటున్నారు..


Tags:    

Similar News