అచ్చెన్నకి అచ్చేదిన్...బాబు గారు భుజం తట్టారోచ్...

Update: 2022-10-30 02:30 GMT
ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తరంధ్రాలో బలమైన బీసీ నేత. ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో ఆయన కుటుంబానికి తిరుగులేదు. జగన్ వేవ్ లో సైతం టెక్కలి సీటు నిలబెట్టుకున్న అచ్చెన్నాయుడు చంద్రబాబుకు కుడిభుజంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఏణ్ణర్ధం క్రితం జరిగిన తిరుపతి ఉప ఎన్నిక వేళ ఒక హొటల్ లో జరిగిన సంభాషణ ఆయనకూ టీడీపీ అధినాయకత్వానికి ఎడం చేసింది అని అంటారు.

నిజానికి అచ్చెన్నాయుడు తాను అలా అనలేదని చెబుతున్నా వీడియో సాక్షిగా పార్టీ లేదూ ఏమీ లేదూ అంటూ ఆయన చేసిన హాట్ హాట్ కామెంట్స్ అప్పట్లో పెద్ద దుమారాన్నే లేవదీశాయి. అంతే కాదు అదే వీడియోలో లోకేష్ గురించి కూడా కొన్ని విమర్శలు అచ్చెన్న చేసినట్లుగా ఉంది. అయితే ఆ వీడియో తనది కాదు అని అచ్చెన్న ఖండించారనుకోండి. అది వేరే విషయం. కానీ చంద్రబాబుకు అచ్చెన్నకు ఒక విధంగా గ్యాప్ రావడానికి ఈ వీడియో కారణం అని ప్రచారంలో ఉన్న మాట.

ఒక దశలో అచ్చెన్నాయుడుని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి నుంచి మార్చేసి వేరే వారికి ఇద్దామని ఆ పార్టీ హై కమాండ్ ఆలోచన చేస్తోంది అన్నట్లుగా కూడా ప్రచారం జరిగిందిపోయింది. ఇక లోకేష్ బాబుకు అయితే అచ్చెన్న కంటే మాజీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు నచ్చేశారు అని కూడా టీడీపీలో గుసగుసలు పోయిన వారికి లెక్కే లేదు. ఇలా టీడీపీలో అచ్చెన్న సంగతి ఏంటి, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన కింజరాపు ఫ్యామిలీకి బిగ్ ట్రబుల్సేనా అన్నట్లుగా కొన్నాళ్ళు రాజకీయ కధ నడిచింది.

అయితే తిరుపతి ఎపిసోడ్ ని పక్కన పెడితే అచ్చెన్న ఏనాడు హై కమాండ్ కి విరుద్ధంగా ముందుకు పోలేదు. ఆయన సాహసించి  స్వతంత్రించి  కూడా ఏ పనీ చేయలేదు. అధినాయకత్వం ఎలా చెబితే అలా అన్నట్లుగా మసలుకున్నారు. మెల్లగా గ్యాప్స్ ని తగ్గించుకున్నారు. ఇపుడు చూస్తే చంద్రబాబే శభాష్ అచ్చెన్నా అంటూ భుజం తట్టి మెచ్చుకున్నారు. టెక్కలిని టీడీపీకి కంచుకోటగా చేశారని తాజాగా జరిగిన సమీక్షలో అచ్చెన్నను బాబు ప్రశంసించారని అంటున్నారు. అంతేకాదు వైసీపీ ఎంత టార్గెట్ చేస్తే అంతలా టెక్కలిలో టీడీపీ బలపడుతోంది అని కూడా బాబు అన్నట్లుగా చెబుతున్నారు.

దాంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ గ్రాఫ్ బాగా పెరిగింది, అలాగే ఉత్తరాంధ్రా జిల్లాలు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని టీడీపీ సైడ్ వచ్చేలా సీన్ ఉందని బాబు ఆనందపడుతున్నారుట. మొత్తానికి అచ్చెన్నను బాబు మెచ్చుకున్నారన్న వార్తతో ఆయన అనుచర వర్గం ఫుల్   హ్యాపీ గా    ఫీల్ అవుతోందిట. తమ నాయకుడు శపధం చేసినట్లుగానే టీడీపీ సర్కార్ వస్తే హో మంత్రి అవడం ఖాయమని కూడా వారు సంబరపడిపోతున్నారుట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News