కేసీఆర్ రంగంలోకి దిగాల్సిందేనా ?
మాజీ సీఎం గా కేసీఅర్ మిగిలిపోయారు. ఆయన ఈ ఓటమి తరువాత పెద్దగా అయితే కనిపించడం లేదు అని అంటున్నారు.
కేసీఆర్ అంటేనే ఒక పొలిటికల్ వైబ్రేషన్. ఏ చిన్న అవకాశం ఉన్నా చొచ్చుకుని పోయే రాజకీయ దూకుడు ఆయన సొంతం. అయితే కేసీఆర్ లోని ఈ దూకుడుని చూసి చాలా కాలం అయింది అని అంటారు. ఆయన 2014లో సీఎం అయ్యాక కాస్తా రిలాక్స్ అయ్యారని చెబుతారు. ఇక 2018లో ముందస్తు ఎన్నికల సమయంలో ఆయన ప్రచారంలో కొత్త వ్యూహాలు రచించారు.
2023లో మాత్రం ఆయన వ్యూహాలు అయితే పెద్దగా ఫలించలేదు. గత పదేళ్ళుగా చూస్తే కనుక ఎన్నికల సమయంలో తప్ప కేసీఆర్ పెద్దగా కనిపించింది తక్కువ అని అంటారు. పార్టీ సైతం అధికారంలో ఉండడంతో కేసీఅర్ కి పెద్దగా పని లేకుండా పోయిందని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే బీఆర్ఎస్ కి 2023 ఎన్నికలు చేదు ఫలితాలు ఇచ్చాయన్న సంగతి తెలిసిందే.
మాజీ సీఎం గా కేసీఅర్ మిగిలిపోయారు. ఆయన ఈ ఓటమి తరువాత పెద్దగా అయితే కనిపించడం లేదు అని అంటున్నారు. ఆయన ఎక్కువగా ఎర్రవల్లిలోని ఫాం హౌస్ లోనే ఉంటున్నారు అని ప్రచారం సాగింది. ఇదిలా ఉంటే కేసీఆర్ ఇపుడు రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది అని అంటున్నారు.
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఅర్ బీఆర్ఎస్ ని గత ఏడాది కాలంగా నడిపిస్తున్నారు. ఆయనతో పాటు మేనల్లుడు హరీష్ రావు కూడా పార్టీకి అండగా ఉన్నా ఫోకస్ అంతా కేటీఆర్ మీదనే ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అటువంటిది కేటీఆర్ ఇపుడు కేసులను ఎదుర్కొంటున్నారు
కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేసు కేసులో అరెస్ట్ అవడం కచ్చితమని అంటున్నారు. దానికి మానసికంగా బీఆర్ఎస్ అగ్ర నేతలు సిద్ధమైపోయారు అని అంటున్నారు. ఇక ఈ కేసులో కేటీఆర్ ని ఏసీబీ అరెస్ట్ చేస్తే బయటకు బెయిల్ పై బయటపడడానికి ఏ విధంగా చేయవచ్చు దానికి తీసుకునే టైం ఎంత వరకూ ఉంటుంది అన్నది అయితే ఈ రోజుకు తెలియదు అని అంటున్నారు.
కేటీఆర్ కొంతకాలం పాటు జైలులోనే ఉంటే అపుడు బీఆర్ ఎస్ పరిస్థితి ఏంటి అన్నది చర్చకు వస్తోంది. ఇక దీని మీదనే బీఆర్ఎస్ అగ్రనాయకత్వంలో కూడా చర్చలు సీరియస్ గానే సాగుతున్నట్లుగా చెబుతున్నారు. కేటీఆర్ కనుక జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే బాధ్యతలను మరో కీలక నేతగా ఉన్న హరీష్ రావుకు అప్పగిస్తారు అని కూడా ప్రచారంలో ఉంది.
అంతే కాదు కుమార్తె కవిత కూడా ఈ బాధ్యతలను తీసుకుంటారు అని కూడా అంటున్నారు. అయితే ఇవన్నీ కాదని ఏకంగా కేసీఆర్ నే బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తనదైన శైలిలో రాజకీయ పోరాటం చేస్తారు అని అంటున్నారు.
ఇప్పటికే తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది. ఒక విధంగా ప్రభుత్వం పాత పడింది. గతంలో ఉన్న ఆశలు ఆకాంక్షలు జనంలో కూడా తగ్గుముఖం పడుతున్నాయి. కరెక్ట్ గా ఇదే సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ కి కాంగ్రెస్ ప్రభుత్వం తెర తీసిందని అంటున్నారు.
అందులో భాగనే కేటీఆర్ అరెస్ట్ అని అంటున్నారు. దాంతో ఇక పూర్వం మాదిరిగా కేసీఆర్ ని చూస్తారని బీఆర్ఎస్ నుంచి గట్టిగా వినిపిస్తున్న మాట. కేసీఆర్ ఇపుడు బయటకు వచ్చి గులాబీ దళానికి నాయకత్వం పూర్తి స్థాయిలో వహించడమే కాకుండా డైరెక్ట్ ఫైట్ కి రెడీ అవుతారు అని అంటున్నారు.
అంటే ఇప్పటిదాకా తెలంగాణా రాజకీయ తెర మీద చూడని సరికొత్త సన్నివేశాన్ని చూడబోతున్నారని అంటున్నారు. రేవంత్ వర్సెస్ కేసీఆర్ అన్న ఎపిసోడ్ పొలిటికల్ గా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంతా దాని కోసం చూస్తున్నారు. కేటీఆర్ ఉండగా ఆయన మీద బాధ్యతలు వదిలేసి కేసీఅర్ కాస్తా దూరం పాటించారు.
ఇపుడూ వారూ వీరూ కాదు నేనే సీన్ లోకి వస్తాను అని కేసీఆర్ అంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఅర్ ఒకే ఒకసారి అసెంబ్లీకి వచ్చారు. అంతే కాదు మీడియా సమావేశాలను పెద్దగా పెట్టింది లేదు. ఇపుడు డైలీ పాలిటిక్స్ లోకి ఆయన దిగితే కనుక ఇక తెలంగాణా పాలిటిక్స్ వేరే రేంజిలోకి చేరుకుంటాయని అంటున్నారు. మొత్తం మీద కొద్ది రోజుల వ్యవధిలోనే తెలంగాణాలో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి అని అంటున్నారు.