విశాఖ‌లో బాబు మ‌కాం.. వైసీపీకి ఇక‌, మూడిందే!!

Update: 2022-10-13 06:30 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీ మూడు రాజధానుల పేరిట దూకుడు పెంచింది. ఈ నెల 15న గ‌ర్జ‌న పేరిట‌.. ర్యా లీ నిర్వ‌హించి.. రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని నిర్ణ‌యించింది. అదేస‌మ యంలో ప్ర‌స్తుతం పాద‌యాత్ర‌లో ఉన్న రాజ‌ధాని రైతుల‌పై పైచేయి సాధించాల‌ని..కూడా వైసీపీ నిర్ణ యించుకుంది. ఈ క్ర‌మంలోనే మంత్రులు.. నాయ‌కులుకూడా దూకుడు పెంచారు. మూడుకు అనుకూ లంగా.. అమ‌రావ‌తికి వ్య‌తిరేకంగా.. మంత్రులే రంగంలోకి దిగిపోయారు.

ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన‌, టీడీపీల‌కు కూడా.. వైసీపీ నేత‌లు.. స‌వాలుగా మారారు. దీంతో .. చంద్ర‌బాబు రం గంలోకి దిగుతున్నారు. విశాఖ‌లోనే మ‌కాం వేసుకుని.. వైసీపీ మూడు రాజ‌ధానుల విష‌యంపై ప్ర‌జ‌ల‌కు నేరుగా.. వివ‌రించ‌నున్నారు.

విశాఖ‌లో ఇప్ప‌టికే భూక‌బ్జాలు పెరిగిపోయాయ‌ని.. దీనికి కార‌ణం.. వైసీపీ నేత‌లేన‌ని.. వివ‌రించ‌డంతోపాటు.. `సేవ్‌-ఉత్త‌రాంధ్ర‌` పేరుతో.. మూడు జిల్లాల ప్ర‌జ‌లకు తాను గ‌తంలో చేసిన తాను గ‌తంలో చేసిన అబివృద్ధిని.. చంద్ర‌బాబు వివ‌రించ‌నున్నారు.

విశాఖ ఆస్తులను కాపాడటానికి 'సేవ్‌ ఉత్తరాంధ్ర' పేరుతో పోరాటం చేద్దామని పార్టీ నేతలకు చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 19 త‌ర్వాత‌.. చంద్రబాబు  విశాఖకు వెళ్లనున్నారు.

అమ‌రావ‌తిని ఎందుకు ఎంపిక చేసుకున్నారు.. అక్క‌డ ఎలాంటి ప్రాజెక్టులు వ‌చ్చాయి... అదేస‌మ‌యంలో విశాఖ‌కు ఇచ్చిన ప్రాధాన్యం ఏంటి.. పెట్టుబ‌డుల స‌ద‌స్సు నిరంత‌రాయంగా.. ఇక్క‌డ నిర్వ‌హించిన విధానం వంటివి కూడా.. చంద్ర‌బాబు వివ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు.

మ‌రోవైపు అమరావతికి అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఉత్త‌రాంధ్ర‌లో బ‌లంగా ఉన్న క‌మ్యూనిస్టులు.. జ‌న‌సేన నాయ‌కుల‌తో క‌లిసి.. రౌండ్ టేబుల్ స‌మావేశాలు కూడా.. చంద్ర బాబు నిర్వ‌హించే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా.. వైసీపీ దూకుడు చెక్ పెట్టేలా.. చంద్ర‌బాబు చాలా వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నార‌నేది ప్ర‌ధానంగా టీడీపీ నేతలు చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News