మాచర్లలో జరిగిన హత్యతో పూర్తి ఆత్మరక్షణలో పడింది ఏపీ అధికారపక్షం. హత్యకు గురైన చంద్రయ్య..ఆయన్ను చంపిన వారు..అందరూ చూస్తుండగానే హత్య చేయటం ఒక ఎత్తు అయితే.. హత్య వేళలో.. వైసీపీకి అడ్డు వస్తున్నాడన్న పేరుతో నినాదాలు చేయటం.. గ్రామంలోని వారికి హెచ్చరికలు జారీ చేసినట్లుగా పలువురుచెబుతున్నారు. చివరకు చంద్రయ్య కుమారుడు ఇచ్చిన ఫిర్యాదులోనూ స్పష్టంగా ఉండటం తెలిసిందే.
అయితే.. ఈ వాస్తవాల్ని తొక్కిపట్టేస్తున్న వైసీపీ నేతలు.. ఈ హత్య ఉదంతం పక్క దారి పట్టేలా ప్లానింగ్ చేయటం గమనార్హం. తాజాగా చంద్రబాబు తమ పార్టీ నేతలతో జరిపిన కాన్ఫరెన్సుకు సంబంధించిన ఆడియోక్లిప్ బయటకు రావటం.. దానికి తమదైన శైలిలో చాటలు కట్టేస్తున్న వైఖరి ఇప్పడు షాకింగో గా మారింది. తమ పార్టీకి చెందిన యాక్టివ్ నేతను అత్యంత దారుణంగా హతమార్చిన నేపథ్యంలో.. పార్టీ అధినేతగా రియాక్టు కావటమే కాదు.. తమ బలాన్ని చూపించాలని చెప్పటం నీచ రాజకీయం ఎలా ఉంటుంది.
వందకార్లు..నూట యాభై కార్లు అంటూ దుర్మార్గ రాజకీయాల్ని నిర్వహించేందుకు పక్కా ప్లానింగ్ తోనే చంద్రయ్య అంతిమ యాత్ర సాగిందన్నట్లుగా వైసీపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. చంద్రబాబుతోపాటు.. పార్టీకి చెందిన ఇతర నేతలు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని వింటే నవ్వు రాక మానదు. పార్టీ అధినేతగా ఉండి.. ఒక కీలక కార్యకర్త కమ్ గుర్తింపు పొందిన నేత దారుణ హత్యకు గురైతే.. దానిపై ఇతర పార్టీల వారు స్పందించి.. సరికొత్త ఆరోపణలు సంధించటం సరికాదంటున్నారు.
కిందిస్థాయి నాయకులు.. కార్యకర్తల్లో మనోధైర్యాన్నిపెంచేలా.. పార్టీఅధినాయకత్వం ప్లాన్ చేయటం తప్పేం కాదు. అంత మాత్రానికే.. లేనిపోని వాదనలు.. ఆరోపణల్ని తీసుకొచ్చి.. దారుణం ఏదో జరిగిపోయినట్లుగా బిల్డప్ ఇస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయటం..రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడటం మంచిది కాదంటున్నారు. క్రియాశీలంగా వ్యవహరించే నేత ఒకరు దారుణ హత్యకు గురి కావటంపార్టీ కార్యకర్తల్లో ఎంతటి నైరాశ్యాన్ని నింపుతుందో.. వారి ఎమోషన్ నుఎంత దారుణంగా దెబ్బ తీస్తుందో తెలిసిందే.
ఈ గాయం నుంచి బయటపడటానికే బోలెడంత టైం పడే వీలుంది. అందుకు భిన్నంగా వారిలో స్ఫూర్తిని నింపేందుకు.. ధైర్యాన్ని పెంచేందుకు భారీగా కార్లతో వచ్చి సంతాపాన్ని తెలియజేయటం.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పటమే కాదు.. రూ.25 లక్షల పరిహారాన్ని అందిస్తామని చెప్పటం లాంటివి కచ్ఛితంగా పార్టీ క్యాడర్ లో స్థైర్యాన్ని నింపుతుందన్నది మర్చిపోకూడదు.
దానికి భిన్నంగా.. ఆడియో క్లిప్ ను తీసుకొచ్చి.. అందులోని మాటలకు తమ కామెంట్లను తీసుకొచ్చి ప్లే చేయటం సరికాదంటున్నారు. రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు కానీ.. ఒక మనిషి దారుణంగా హత్యకు గురైన వేళ.. పరామర్శకు.. స్థైర్యాన్ని కోల్పోయిన పార్టీ క్యాడర్ ను దిశానిర్దేశం చేయటం తప్పే అవుతుందన్న ప్రచారం చేస్తున్న వైసీపీ నేతల తీరు హాట్ టాపిక్ గా మారింది.